SSMB 29 : మహేష్ లుక్ రివీల్ చేసిన రాజమౌళి!
on Mar 19, 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్.. గత రెండు వారాల నుంచి ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరుగుతోంది. మంగళవారం రాత్రి ఈ ఒడిశా షెడ్యూల్ పూర్తయింది.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొన్న ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షెడ్యూల్ పూర్తయ్యి హైదరాబాద్ కి వచ్చే ముందు.. 'SSMB 29' టీంతో అక్కడి నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఫొటోలలో మహేష్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పొడవాటి జుట్టు, గడ్డం మీసాలతో మహేష్ లుక్ అదిరిపోయింది.
ఇక కోరాపుట్ స్థానిక ప్రజల ఆతిథ్యానికి ఫిదా అయిన 'SSMB 29' మూవీ టీం.. వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపింది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలయ్యే అవకాశముంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
