Home

»

Latest News

ఇట్లు.. ప్రేమతో మీ మహేశ్

Nov 1, 2016 5:09PM

మహేశ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దీపావళిని పురస్కరించుకుని సూపర్‌స్టార్ తన కో-స్టార్స్‌కి గిఫ్ట్స్ పంపి సర్‌ప్రైజ్ చేశాడు. ఆయన సహనటులంటే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, లేక మరేవ్వరో కాదు..ఓ ప్రైవేట్ స్కూల్ చిన్నారులు. హైదరాబాద్‌లో షూటింగ్ సందర్భంగా ఒక సన్నివేశం కోసం మహేశ్ పక్కన 2500 మంది చిన్నారులు నటించారు. షూటింగ్ అయిపోయాక వాళ్లతో కలిసి ఫోటోలు దిగి ఆటోగ్రఫ్‌లు ఇచ్చి పిల్లలతో జాలిగా గడిపాడు. కానీ అది ప్రిన్స్‌కి తృప్తినివ్వలేదు. అందుకే దీవాళి రోజున తనతో షూటింగ్‌లో పాల్గొన్న పిల్లలందరికీ చాక్లెట్స్‌ నిండిన గిఫ్ట్ బాక్స్‌లు పంపాడు. అందుకోసం ఆ బాక్స్‌ని సరికొత్తగా డిజైన్ చేయించాడు. ప్రతి బాక్స్‌పై తాను పిల్లలతో దిగిన ఫోటోని అంటించి, బాక్స్‌ లోపల థాంక్స్ చెపుతూ స్వయంగా తాను సంతకం చేసిన కార్డును కూడా పెట్టించాడు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com