Home

»

Latest News

ప్రాణాపాయం నుంచి బయటపడ్డ మహేశ్

Nov 1, 2016 4:06PM

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మహేశ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అందుకోసం జూబ్లిహిల్స్ రోడ్ నెం.87లో భారీ సెట్ వేశారు. అయితే కొద్దిసేపటి క్రితం ఇక్కడ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి టపాసుల వల్ల మంటలు చెలరేగి సెట్ అంతా తగలబడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ షూటింగ్ స్పాట్‌కు దూరంలోనే చిత్ర యూనిట్ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఆస్తినష్టం భారీగానే జరిగి ఉండవచ్చని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ అభిమానులు ఘటనా స్థలికి భారీగా చేరుకుంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com