Home

»

Latest News

క‌మ‌ల్ నుంచి విడిపోతున్నా : గౌత‌మి లేఖ‌

Nov 1, 2016 3:48PM

క‌మ‌ల్ హాస‌న్ - గౌత‌మిల బంధం బీట‌లు వారింది. ఇప్పుడు ఇద్ద‌రూ విడిపోవాల‌ని నిర్ణ‌యించుకొన్నారు. దీన్ని గౌత‌మి కూడా ధృవీక‌రిస్తూ ఓ లేఖ విడుద‌ల చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో గౌత‌మి లేఖ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. క‌మ‌ల్ నుంచి విడిపోతున్నాన‌ని, ఇది త‌న జీవితంలోనే క‌ఠిన‌మైన నిర్ణ‌య‌మ‌ని గౌత‌మి త‌న లేఖ‌లో పేర్కొంది. ‘నేను, మిస్టర్‌ హాసన్‌ ఇంక ఎక్కువ కాలం కలిసి ఉండలేమన్న విషయం నా హృదయాన్ని బాధిస్తోంది. దాదాపు 13 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత, నేను నా జీవితంలో తీసుకుంటున్న అతి క‌ఠిన‌మైన నిర్ణ‌యం ఇది.  

కమిటెడ్‌ రిలేషన్‌ షిప్‌లో మన కలలే ముఖ్యమని అనుకోవడమా, లేక వాటిని కాదని జీవితంతో రాజీ పడడమా అని తేల్చుకోవడం ఎవరికీ అంత సులభతరమైన పనికాదు. హృదయం బద్దలయ్యే ఈ నిజం అంగీకరించడానికి, ఈ నిర్ణయానికి రావడానికి చాలా కాలం పట్టింది. ఒకర్ని తప్పుపట్టడానికో లేక సానుభూతి పొందడమో నా ఉద్దేశం కాదు. నా జీవితాన్ని నేను అర్థం చేసుకున్నా.

మార్పు అనేది మానవ సహజం. నేను మొదట తల్లిని. సాధ్యమైనంత వరకు నా బిడ్డకు ఉత్తమ త‌ల్లిగా ఉండాల్సిన బాధ్య‌త నాపై ఉంది.  నాతో నేను ప్రశాంతంగా ఉండాలి. నేను చిత్ర పరిశ్రమలోకి రాకముందు, వచ్చిన తర్వాత కమల్‌హాసన్‌కు పెద్ద అభిమానిని. ఇప్ప‌టికీ ఆయ‌న‌పై అభిమానం కొన‌సాగుతుంది`` అంటూ ఓ సుదీర్ఘ‌మైన లేఖ రాసింది గౌత‌మి.  కమల్‌ నటిస్తున్న ‘శభాష్‌నాయుడు’  షూటింగ్‌లో  శ్రుతిహాసన్‌, గౌతమిల మధ్య విబేధాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్త‌ల్ని ఇద్ద‌రూ ఖండించారు కూడా. ఆ ఘ‌ట‌న ముగియ‌క ముందే గౌత‌మి ఇలా ఓ షాకింగ్ న్యూస్ ఇచ్చింది.  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com