మహేశ్ వీరాభిమాని ఆత్మహత్య!
on Mar 3, 2020
.jpg)
సూపర్‌స్టార్ మహేశ్ వీరాభిమాని అయిన 23 సంవత్సరాల తమిళ నటి పద్మజ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం తిరువొట్టియూర్ ( చెన్నై)లోని తన నివాసంలో ఆమె ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె భర్త పవన్ నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నట్లు సమాచారం. పవన్ ఆంధ్రప్రదేశ్‌లోని తన స్వస్థలంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరి మధ్యా గొడవలకు కారణమేంటనే విషయం తెలియాల్సి ఉంది. ఒక వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు భర్తతో గొడవల నేపథ్యంలో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. వాళ్లకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఆమె ఉంటున్న ఫ్లాట్ యజమానికి అనుమానం వచ్చి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ ఫ్లాట్‌కు వచ్చి, తలుపులు బద్దలుకొట్టి చూడగా, ఆమె శరీరం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. పద్మజ తమిళ టీవీ సీరియల్స్‌లో నటిస్తూ, సినిమాల్లో అడపాదడపా చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చారు. మహేష్ ఫొటో ముందు పద్మజ చేతిలో వెలిగించిన కర్పూరం పెట్టుకొనగా, మిగతా ఫ్యాన్స్ మహేశ్ పేరును పెద్దగా ఉచ్ఛరిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ట్విట్టర్, ఫేస్‌బుక్ వేదికలుగా మహేశ్ అభిమానులు పద్మజ ఆత్మహత్య వార్తను వ్యాపింపజేస్తూ, ఆమెకు నివాళులర్పిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



