మహేష్ బాబు నాన్నకు ప్రేమతో..
on Mar 3, 2016

సూపర్ స్టార్ మహేష్ బాబుకు కృష్ణ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అందుకే తన తండ్రి హీరోగా నటించిన సినిమాకు గాత్రదానం చేసి హెల్ప్ అయ్యాడు. విషయంలోకి వెళ్తే, సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా శ్రీశ్రీ. సంక్రాంతి, రాజా లాంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించాడు. ఈ వయసులో కూడా పంచ్ డైలాగులు, ఫైట్ సీక్వెన్స్ లతో శ్రీశ్రీలో కృష్ణ మంచి ఎనర్జీతో కనిపిస్తున్నారు. మహేష్ వాయిస్ ఇస్తే సినిమాకు మైలేజ్ వస్తుందని దర్శకుడు భావించడంతో, తండ్రి కోసం ఈ సినిమాకు గాత్రదానం చేశారు మహేష్. కొద్ది రోజుల్లోనే బ్రహ్మోత్సవం కోసం వారణాసి వెళ్లనున్న నేపథ్యంలో, ముందుగానే ఫినిష్ చేస్తే బెటర్ అని మహేష్ భావించినట్టు సమాచారం. ఈ సినిమాలో కృష్ణతో పాటు, విజయ నిర్మల, నరేష్, సాయికుమార్ ముఖ్యపాత్రల్లో నటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



