ఫర్ ది ఫస్ట్ టైమ్.. వారణాసిలో షర్ట్‌లెస్ మహేష్‌ని చూస్తారు
on Dec 2, 2025
సినిమాల్లో హీరో అంటే విలన్లను, వారి అనుచరులను చితక్కొట్టేంత పవర్ ఉన్నవాడు. ఎంత మంది ఎదురొచ్చినా వారిని మట్టి కరిపిస్తూ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటాడు. దుష్టశక్తులను ఎదుర్కోవాలంటే హీరోకి గుండె బలంతోపాటు కండబలం కూడా ఉండాలి. అప్పుడే హీరో చేసే విన్యాసాలకు జస్టిఫికేషన్ వస్తుంది.
పాతతరం హీరోలకు ఇలాంటి క్వాలిటీస్ లేకపోయినా నెగ్గుకు రాగలిగారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పటి ప్రేక్షకుల టేస్ట్ వేరు. హీరో ఒక్క దెబ్బ కొట్టాడంటే విలన్‌కి చుక్కలు కనిపించాలి. అలాంటి ఎఫెక్ట్ రావాలంటే హీరో కండల వీరుడై ఉండాలి. ఇప్పటి జనరేషన్ హీరోలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు, క్యారెక్టర్ డిమాండ్ మేరకు తమ శరీరాకృతిని మార్చుకుంటూ వస్తున్నారు. అవసరమైతే షర్ట్ లేకుండా తమ కండలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలను వదిలేస్తే ఆ తర్వాత వచ్చిన హీరోల్లో మొదట 'తమ్ముడు' చిత్రంలో షర్ట్‌లెస్‌గా కనిపించాడు పవన్‌కళ్యాణ్. చాలా కాలం తర్వాత 2007లో పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'దేశముదురు' కోసం అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనమిచ్చాడు. ఆరోజుల్లో మీడియాలో, ప్రేక్షకుల్లో ఇదొక సెన్సేషనల్ టాపిక్ అయింది. ఇక అప్పటి నుంచి మిగతా హీరోలు కూడా షర్ట్‌లెస్‌గా కనిపించే సందర్భం వస్తే దాన్ని విడిచిపెట్టలేదు. 'బుజ్జిగాడు' సినిమాలో ప్రభాస్ తన షర్ట్ విప్పి కండలు చూపిస్తూ ఫైట్ చేసే సీన్ ఉంటుంది. ఈ సినిమాకి కూడా పూరి జగన్నాథే డైరెక్టర్ కావడం విశేషం. ఆ తర్వాత మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో తన క్యారెక్టర్ కోసం ప్రభాస్ ఎంత హెవీ బాడీ మెయిన్‌టెయిన్ చేశాడో మనం చూశాం.
అలాగే ఎన్టీఆర్ కూడా 'టెంపర్' కోసం షర్ట్‌లెస్‌గా కనిపించాడు. ఈ సినిమాకి కూడా పూరి జగన్నాథే దర్శకుడు కావడం మరో విశేషం. రామ్‌చరణ్ విషయానికి వస్తే 'ధృవ' చిత్రంలో తన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించాడు. 2000వ దశకం నుంచి హీరోలుగా కొనసాగుతున్న హీరోలంతా దాదాపు ఏదో ఒక సందర్భంలో షర్ట్‌లెస్‌గా కనిపించి ప్రేక్షకులతో, అభిమానులతో చప్పట్లు కొట్టించుకున్నారు. అయితే టాలీవుడ్‌లో టాప్ హీరోలుగా ఉన్నవారిలో మహేష్‌బాబు ఒక్కడే ఆ ప్రయత్నం చెయ్యలేదు.
మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబల్ మూవీగా వస్తున్న 'వారణాసి' చిత్రంలో ఫర్ ద ఫస్ట్ టైమ్ మహేష్ షర్ట్‌లెస్‌గా కనిపించబోతున్నాడు అనేది లేటెస్ట్ న్యూస్. అందుకే ఈ సినిమా ప్రారంభానికి ముందే ఫిజికల్‌గా కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నాడు మహేష్. ఇది ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే అడ్వంచరస్ మూవీ. కాబట్టి హీరో కండల ప్రదర్శన అనేది అవసరం. అది సినిమాకి అడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఆ ఆలోచనతోనే మహేష్‌ని రాజమౌళి మొదటి నుంచీ ప్రిపేర్ చేసినట్టుగా కనిపిస్తోంది.
తను 'వారణాసి'లో షర్ట్‌లెస్‌గా కనిపించబోతున్నాననే విషయాన్ని ఆమధ్య రామోజీ ఫిలింసిటీలో జరిగిన ఈవెంట్‌లోనే మహేష్ రివీల్ చేశాడు. తను ఈవెంట్‌లో ఎలా కనిపించాలి అనేది రాజమౌళే డిసైడ్ చేశాడని, తను రెగ్యులర్‌గా ఈవెంట్స్‌కి వచ్చే డ్రెస్‌లో వస్తానంటే కుదరదని చెప్పి తన కాస్ట్యూమ్‌ని కూడా ఆయనే సెలెక్ట్ చేశాడని చెబుతూ.. 'ఇంకా నయం షర్ట్ లేకుండా రమ్మనలేదు' అంటూ ఒక హింట్ ఇచ్చాడు మహేష్. అతను అలా మాట్లాడడం వెనుక 'వారణాసి'లో తను షర్ట్ లేకుండా కనిపిస్తానని చెప్పడమేనని అందరూ భావిస్తున్నారు. సో.. 'వారణాసి' సినిమాలో మొదటిసారి మహేష్‌ని షర్ట్ లేకుండా చూడబోతున్నామన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



