'పుష్ప' విడుదలయ్యాక మరోసారి వైరల్ అయిన మహేశ్ ట్వీట్!
on Dec 17, 2021

అల్లు అర్జున్ టైటిల్ పాత్రధారిగా సుకుమార్ రూపొందించిన 'పుష్ప' మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నేడు (డిసెంబర్ 17) విడుదలైంది. కూలివాడి నుంచి ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎదిగే పుష్పరాజ్ అనే యువకుడి కథ ఇది. తొలిరోజు 'పుష్ప'కు మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాని సుకుమార్ తీసిన విధానం, 'పుష్ప' కథపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. సెటైరికల్ మీమ్స్ కూడా తెగ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల క్రితం మహేశ్ చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆ ట్వీట్‌ను మహేశ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
Also read: మార్నింగ్ షోస్‌కు 'పుష్ప' ఆక్యుపెన్సీ ఇదే!
నిజానికి అల్లు అర్జున్ కంటే ముందు మహేశ్‌తో సుకుమార్ సినిమా చేయాలి. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ సినిమా నుంచి మహేశ్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించాడు. 2019 మార్చి 4న, "క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల, సుకుమార్‌తో నా సినిమా జరగట్లేదు. తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్న సందర్భంగా అతనికి ఆల్ ద బెస్ట్. ఒక ఫిల్మ్‌మేకర్‌గా అతని నైపుణ్యాన్ని ఎల్లప్పడూ గౌరవిస్తాను. '1 నేనొక్కడినే' ఎప్పటికీ కల్ట్ క్లాసిక్. ఆ సినిమాకు పనిచేసిన ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను" అని ట్వీట్ చేశాడు మహేశ్. అప్పట్లో ఆ ట్వీట్ వైరల్ అయ్యింది.
Also read: 'పుష్ప' మూవీ రివ్యూ

ఇప్పుడు ఆ ట్వీట్‌ను పలువురు మహేశ్ ఫ్యాన్స్ రిట్వీట్ చేస్తూ, పుష్ప కథను సుకుమార్ చెప్పినప్పుడు మహేశ్ తిరస్కరించాడనీ, ఇప్పుడు ఎందుకు తిరస్కరించాడో అర్థమైందనీ కామెంట్లు పెడుతున్నారు. పుష్పరాజ్ లాంటి డీగ్లామర్ క్యారెక్టర్, అతని స్టోరీ తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోవనే ఉద్దేశంతోనే మహేశ్ ఆ మూవీ నుంచి మహేశ్ తప్పుకున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా 'పుష్ప' కథపై మహేశ్ జడ్జిమెంట్ నిజమైందనే ఒపీనియన్ సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



