మహేష్ పొలంలో పూజా హెగ్డే
on Jan 22, 2019

మహేష్‌బాబు పొలం పనుల్లో బిజీగా వున్నాడు. 'మహర్షి' సినిమా కోసం నాగలి పట్టి, విత్తనాలు చల్లుతూ రైతుగా మారాడు. మహేష్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా పొలంలో దిగింది. అయితే ఆమె చిత్రీకరణ ఒక్క రోజులో ముగిసింది. ఇంకా చెప్పాలంటే కొన్ని గంటల్లో ముగిసింది. ప్రస్తుతం 'మహర్షి' చిత్రీకరణ పొలాచ్చిలో జరుగుతుంది. హైదరాబాద్ నుంచి ఆదివారం రాత్రి పొలాచ్చి వెళ్లిన పూజా హెగ్డే, సోమవారం ఉదయం 'మహర్షి' సెట్స్‌లో అడుగుపెట్టింది. అయితే.. సాయంత్రం కల్లా చిత్రీకరణ పూర్తి చేసుకుని తిరుగు పయనమైంది.
మహేష్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇంకొన్ని రోజులు వుంటుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి సన్నివేశాలను చెక్కుతూ పోతుండటంతో అనుకున్న సమయం కంటే షూటింగ్ డేస్ పెరుగుతున్నాయి. వాటితో పాటు బడ్జెట్ పెరుగుతూ వెళ్తోంది. ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమవుతుండటంతో త్వరగా టాకీ పూర్తి చేసి, మిగతా పాటల చిత్రీకరణ చేయాలి. దిల్‌రాజు, సి. అశ్వనీదత్, పివిపి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మహేష్ స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం సినిమాలో ప్రత్యేక ఆకర్షణ కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



