నేడు ఈడి ముందు హాజరుకానున్న మహేష్ బాబు..ఏం జరగనుంది!
on May 12, 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)సుదీర్ఘ కాలం నుంచి పలు రకాల యాడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి సూర్య ,సురానా డెవలపర్స్ వంటి పలు సంస్థలకి ప్రమోటర్ గా వ్యవహరిస్తు వస్తున్నాడు. ఈ రెండిటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలోని ఎన్ ఫోర్స్ డిపార్టుమెంట్ మహేష్ బాబు కి నోటీసులు జారీ చేసింది. గత నెల ఇరవై ఏడున విచారణకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చెయ్యగా మహేష్ విదేశాల్లో ఉండటంతో ఈడి ని కొంత సమయం కోరాడు.
దీంతో నేడు ఈడీ(Ed)ముందుకు మహేష్ హాజరు కానున్నాడు. ప్రమోషన్స్ కి మహేష్ 5.9 కోట్ల రూపాయిలు తీసుకున్నట్టుగా అధికారులు గుర్తించగా ఈ విషయంపై మహేష్ ని విచారించనున్నారు. మహేష్ ప్రస్తుతం రాజమౌళి తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా ఇటీవలే ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
