
అభిమానులకి, ముఖ్యంగా భారతీయ క్రికెట్ అభిమానులకి అదిరిపోయే గుడ్ న్యూస్. క్రికెట్ ప్రేమికుల ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ వివాహం ప్రముఖ హీరోతో జరగబోతుందనే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
సన్నీ డియోల్.. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో. ఈ హీరో చిన్న కుమారుడు, యువ నటుడు రాజ్‌వీర్ డియోల్‌తోనే సారా వివాహం జరగబోతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఇటీవల జరిగిన ఒక ప్రైవేట్ పార్టీలో రాజ్‌వీర్, సారా తొలిసారి కలుసుకున్నారని, ఆ పరిచయం కాస్తా క్రమంగా సన్నిహిత స్నేహంగా మారి, ఇరు కుటుంబాల మధ్య పెళ్లి ప్రస్తావన వరకు వెళ్లిందన్న చర్చ జోరుగా సాగుతోంది.
అంతేకాదు, రాజ్‌వీర్ తరఫు నుంచి సారాకు ఖరీదైన బహుమతులు కూడా అందుతున్నాయని, వీరిద్దరూ 2027లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా పోస్టుల్లో ఊహాగానాలు వెలువడ్డాయి. సారా సంభాషణలు, కుటుంబ సభ్యుల వ్యాఖ్యలంటూ కొన్ని అస్పష్టమైన పోస్టులు నెట్టింట షేర్ అవుతుండటంతో, అటు క్రికెట్ అభిమానుల్లోను, ఇటు సినీ ప్రేక్షకుల్లోను ఆసక్తి ఏర్పడింది.
.webp)
ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన సచిన్ టెండూల్కర్ కుటుంబం, హిందీ సినిమా దిగ్గజాలు ధర్మేంద్ర, సన్నీ డియోల్ కుటుంబాలు ఒక్కటయ్యే అరుదైన కలయికగా మారడం ఖాయం.
ఇది కూడా చదవండి: ఆ నలుగురు తెలుగు హీరోలు అడిగితే వాళ్ళ సినిమాల్లో ఆ..క్యారక్టర్ చేస్తా: సల్మాన్ సంచలన ప్రకటన!
అయితే సారా గానీ, రాజ్‌వీర్ గానీ వివాహ ప్రణాళికల గురించి ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఇరువురి కుటుంబ సభ్యులు సైతం ఈ వార్తలని ధృవీకరించలేదు. అందువల్ల సారా,రాజ్‌వీర్ పెళ్లి వార్తలని ఇప్పుడే నిజమని నమ్మడం తొందరపాటు అవుతుంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవి కేవలం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సెలబ్రిటీ రూమర్స్ మాత్రమే. ఎందుకంటే సారా గతంలో ప్రముఖ స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉందనే వార్తలు సైతం వినిపించిన విషయం తెలిసిందే.

రాజ్‌వీర్ నేపథ్యాన్ని చూస్తే, 2023లో విడుదలైన రొమాంటిక్ డ్రామా చిత్రం 'డోనో' ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నటనలోకి రాకముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేసాడు.
మీకు నచ్చవచ్చు :ఆకాశంలో ఒక తార ఫస్ట్ డే కలెక్షన్స్
మీకు నచ్చవచ్చు: ఓం షాకింగ్ కలెక్షన్స్!
[Sara Tendulkar, Rajveer Deol, Sunny Deol, sachin tendulkar]





