మహావతార్ నరసింహ డిలీట్ వీడియో బయటకి.. ఎవరి పని ఇది
on Sep 13, 2025
![]()
శ్రీ మహావిష్ణువు'(Sri Mahavishnuvu)అవతారాల్లో ఒకటైన 'నరసింహ' అవతారం ఆవిర్భావానికి గల కారణాన్ని వివరిస్తు,ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మహావతార్ నరసింహ'(Mahavatar Narsimha)సాధించిన ఘన విజయం తెలిసిందే. ఎప్పట్నుంచో థియేటర్స్ ముఖం చూడటం మానేసిన వాళ్ళని సైతం థియేటర్స్ కి రప్పించింది. అనేక థియేటర్స్ మహావిష్ణువు భజనలతో దేవాలయాలుగా కూడా మారాయి. దీన్ని బట్టి 'మహావతార్ నరసింహ' సృష్టించిన ప్రభంజనం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టే పెద్ద చిత్రాలకి సైతం షాక్ ఇస్తు వరల్డ్ వైడ్ గా 300 కోట్ల రూపాయలని రాబట్టింది.
జులై 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నిన్నటితో యాభై రోజులని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ 'మహావతార్ నరసింహ'కి సంబంధించిన డిలీట్ వీడియోని రిలీజ్ చేసింది. సదరు వీడియోలో విష్ణుభక్తిని అణువణువు నింపుకున్న తన కుమారుడు 'ప్రహ్లాదుడు'(Prahlada)ని చంపలేకపోతున్నందుకు, ఏకాంత మందిరంలో ఉన్న హిరణ్యకశిపుడు ఎంతగానో మదనపడుతుంటాడు. ఆ సమయంలో హిరణ్యకశిపుడు సురాపానాన్ని తాగుతు ఉన్నాడు. ఆ తర్వాత అద్దంలో తన ప్రతిమ కనపడి, నిన్ను నువ్వు పరాక్రమమైన మహా శక్తిమంతుడిగా భావిస్తావు. కానీ ఐదేళ్ల వయసున్న చిన్నపిల్లవాడ్ని చంపలేకపోతున్నావు. ఈ లెక్కన ఆ విష్ణవు ని ఎలా చంపగలవు. ఇది ఇలాగే కొనసాగితే నీ కోపాన్ని చూసి కుక్క కూడా బయపడదని చెప్పగానే హిరణ్యకశిపుడు కోపంతో అద్దాన్ని ధ్వంసం చేస్తాడు. ఈ విధంగా నిమిషం ఇరవై తొమ్మది సెకన్ల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.
మహావతార్ నరసింహని క్లీమ్ ప్రొడక్షన్స్, హోంబలే ఫిల్మ్స్ ఎంతో భక్తి భావంతో నిర్మించగా అశ్విని కుమార్(Ashwin Kumar)దర్శకత్వం వహించాడు. మహావతార్ ఫ్రాంచైజీ లో భాగంగా తదుపరి 'మహావతార్ పరశురామ్' 2027 వ సంవత్సరంలో 'మహావతార్ రాఘవనందన' (2029), 'మహావతార్ ద్వారకాధీష్' (2031), మహావతార్ గోకులనంద(2033 ), 'మహావతార్ కల్కి పార్ట్ 1 (2035 ) పార్ట్ 2 (2037) లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సామ్ సిఎస్ సంగీత దర్శకుడు. మహావతార్ నరసింహ ఇప్పటికి 200 థియేటర్స్ కి పైగా రన్ అవుతుండటం విశేషం.
![]()
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



