ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన అశ్వనీదత్
on Mar 12, 2018

ఎవడే సుబ్రహ్మణ్యం తో దర్శకుడిగా పరిచయమయిన నాగ్ అశ్విన్, తన రెండో సినిమాగా సావిత్రి బయోపిక్ ఎంచుకున్నాడు. మహానటి టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తుంది. విజయ్ దేవరకొండ, సమంత కీలక పాత్రలు పోషిస్తున్న మహానటిలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ క్యారెక్టర్ లో అలరించనున్నాడు. ఈ సినిమా విడుదల పలుమార్లు జాప్యం అయింది. దాదాపు షూటింగ్ పూర్తయినప్పటికీ, ఎన్టీఆర్, ఏయన్నార్ కి సంబంధించిన ఎపిసోడ్స్ తీయాల్సి ఉంది. ఈ పాత్రలకి మొదటినుండి ఆ లెజెండ్స్ యొక్క మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ మరియు నాగ చైతన్య ని అనుకున్నారు. కానీ, ఈ యంగ్ హీరోలిద్దరు ఆ పాత్రలు చేసే ధైర్యం చేయలేదు. మొత్తానికి, ఏదో చేసి చైతు ని ఒప్పించినప్పటికీ, ఎన్టీఆర్ ససేమీరా అంటున్నాడట. పెద్దాయన పాత్ర చేసేంత పరిపక్వత తనలో లేదని తప్పించుకున్నాడట. అయితే, ఇప్పుడు చైతు ఓకే చెప్పడంతో సంకటంలో పడ్డాడట ఎన్టీఆర్. మరోపక్క, అశ్వినీదత్ నుండి ఫోర్స్ ఎక్కువవడంతో, ఏం చెప్పాలో తెలియక తప్పించుకు తిరుగుతున్నాడట. త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఏం డిసైడ్ చేస్తాడో చూడాలి. ఎన్టీఆర్ ఒప్పుకుంటే గనక, మహానటి స్థాయి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



