శుక్రవారం శుభవార్త చెప్పబోతున్న మంచు మనోజ్!
on Jan 19, 2023

మంచు మనోజ్ దొంగ దొంగది చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించారు. కానీ ఒక్క చిత్రం కూడా ఈయనకు సరైన సక్సెస్‌ను అందించలేకపోయింది. ఈయన పలు విధాలుగా తన ప్రతిభను వివిధ రంగాలలో చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నిర్మాతగా, హీరోగా, సింగర్ గా ఇలా ఎన్నో అవతారాలు ఎత్తారు. తనను తాను మల్టీ టాలెంటెడ్ గా నిరూపించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు తిప్పికొట్టాయి. అయితే మనోజ్ చాలా కాలంగా సినిమాకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ఆయన గురించి వినడం తప్ప ఎక్కడా కనిపించడం లేదు. సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది. ఇక మంచు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. కానీ పలు కారణాల వలన వారు 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి మంచు మనోజ్ ఒంటరిగా జీవితం గడుపుతున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నారు. మీడియాకు కనిపించడం లేదు.
ఇటీవల భూమా మౌనికతో కనిపించారు. తాజాగా తాను ఈనెల 20వ తారీకున అందరితో ఒక గుడ్ న్యూస్ పంచుకుంటానని అని ఈ బిందాస్ హీరో చెప్పుకొచ్చారు. జీవితంలో తాను తరువాతి దశలోకి అడుగుపెట్టబోతున్నట్టు చెప్పారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉండడంతో ఆయన చెప్పే న్యూస్ సినిమాల గురించి కాదు అని అర్థమవుతుంది. అది బహుశా ఆయన రెండో పెళ్లి ని ఉద్దేశించే అని పలువురు భావిస్తున్నారు. గత కొంతకాలంగా మంచు మనోజ్ భూమా మౌనికను రెండో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి వినాయక ఉత్సవాలలో పాల్గొన్నారు. ప్రేమలో ఉన్నట్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అంతేకాకుండా సహజీవనం చేస్తున్నట్టు కూడా వార్తలు వైరల్ అయ్యాయి. వీటికి తోడు ఇటీవలే కడప దర్గాకు వెళ్లిన మనోజ్ త్వరలోనే కొత్త జీవితం మొదలు పెడతానని ఈసారి ఫ్యామిలీతో అక్కడకు వస్తానని చెప్పడంతో ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఈ ట్వీట్లు ఆయన 20వ తేదీన దివంగత నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా చెప్పడమే దాని ఉద్దేశ్యంగా భావిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



