నేను చైల్డ్ ఆర్టిస్ట్ ని.. బాలకృష్ణగారి మూవీ నరసింహనాయుడులో నటించాను
on Apr 25, 2023

సినిమా పాటలే కాదు జానపద పాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. త్వరగా పేరు రావడం కోసం చాలా మంది ఈ ఫోక్ సాంగ్స్ వైపు ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి టైములో మానస్, విష్ణుప్రియ ఇద్దరూ కలిసి ఒక టు ఫోక్ సాంగ్స్ చేశారు. అవి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు వాళ్ళు "మై విలేజ్ షో" అనిల్ తో కలిసి బొందలో చికెన్ వండుకుని తిని హ్యాపీ మూమెంట్స్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అందులో భాగంగా అనిల్ మానస్ గురించి ఎన్నో విషయాలు అడిగాడు. "సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి కలుద్దాం కలుద్దాం అనుకుంటూ ఇప్పటికి కుదిరింది. అసలు మీ ప్రయాణం ఇటు వైపు ఎలా" అని అనిల్ అడిగేసరికి "నేను చైల్డ్ ఆర్టిస్ట్ ని...బాలకృష్ణ గారి మూవీ నరసింహనాయుడులో నటించాను.
హీరో అనే చిల్డ్రన్ ఫిలింలో నటించినందుకు నాకు నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత నా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని ఇటు వచ్చేసాను. నేను బి.టెక్ ఈసిఈ కంప్లీట్ చేసాను. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన దగ్గర నుంచి నేను అందరికి ఇంకా ఎక్కువగా తెలిసాను." అని చెప్పాడు. ఈ గంగులు అనే సాంగ్ కి భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందించారు.. జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ కోరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు ఈ బొందలో చికెన్ సెలబ్రేషన్ లో భాగంగా శ్రష్టి వర్మ కూడా ఈ టీంతో జత కట్టింది. వాళ్లకు "గంగులు" సాంగ్ కి స్టెప్స్ వేసి చూపించింది. కానీ వాళ్ళు సరిగా చేయకపోయేసరికి నేను ఏదో చెప్తుంటే మీరు ఏదో చేస్తున్నారు అంది నవ్వుతూ.. అలా వాళ్లంతా అంతా కలిసి బొందలో చికెన్ వండుకుని తిని ఫుల్ ఎంజాయ్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



