
`మా` ప్రెసిడెంట్ గా నరేష్ ఎన్నకైన తర్వాత `మా` కార్యవర్గం తొలిసారి ఈ రోజు సమావేశమైంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకున్న సభ్యులు తమ సమస్యలను తెలిపేందుకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు చేసారట. పింఛను దారులకు గతంలో ఇస్తోన్నఫించను అదనంగా వెయ్యి రూపాయలు పెంచినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను `మా` సభ్యులకు కూడా వర్తింప చేసేలా అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నారట. అలాగే ఇరవై ఐదు వేలు చెల్లించిన కొత్త సభ్యులకు గోల్డ్ కార్డ్ లు అందజేస్తారట. దీని టైమ్ రెండేళ్ల వరకు ఉంటుందనీ, ఇక డెభ్బై ఐదు వేలు చెల్లిస్తే పర్మినెంట్ కార్డ్ అందజేస్తామని తెలిపినట్టు సమాచారం. పర్మినెంట్ కార్డ్ లభించనంత వరకు ఎవరికి ఎలాంటి `మా` తరపు సౌకర్యాలు లభించవట. అలాగే గతంలో ఉన్న రెండు లక్షల సురక్ష జీవిత బీమాను మరో లక్ష పెంచనున్నారట.






