Home

»

Latest News

విష్ణు హీరోయిన్ గా లక్స్ డ్రీమ్ గర్ల్

Mar 22, 2011 12:23PM

 vishnuvarthan wallpapers, vishnuvarthan stills, vishnuvarthan pics, vishnuvarthan images, vishnuvarthan photos, vishnuvarthan pictures విష్ణు హీరోయిన్ గా లక్స్ డ్రీమ్ గర్ల్ ని ఎన్నిక చేయనున్నారు. విష్ణు అంటే యువ హీరో మంచు విష్ణువర్ధన్. 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ, స్ప్రింట్ తెలీ ఫిలింస్ కలసి లక్స్ డ్రీమ్ గర్ల్ టాలెంట్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ఈ పోటీలో గెలుపొంది లక్స్ డ్రీమ్ గర్ల్ గా ఎన్నికైన అమ్మాయిని తను హీరోగా నటించబోయే తదుపరి చిత్రంలో మంచు విష్ణు వర్థన్ హీరోయిన్ గా అవకాశమిస్తారు. ఏప్రెల్ 3 వ తేదీ నుండి హైదరాబాద్ లో తాజ్‍ హోటల్లోనూ, విజయవాడలో మురళీ ఫార్ట్యూన్ లోనూ, విశాఖపట్టణంలో దసపల్లా హోట;ల్లోనూ ఈ టాలెంట్ సెర్చ్ నిర్వహిస్తారు.

సినీ పరిశ్రమలో హీరోయిన్ అవ్వాలనుకునే అమ్మాయిలు ఎవరిని కలవాలో, ఏ విధంగా హీరోయిన్ అవ్వాలో తెలియక ఇబ్బంది పడుతూంటారు. అలాంటి అమ్మాయిలకు ఇదొక సువర్ణావకాశంగా చెప్పవచ్చు. పైన పేర్కొనబడిన సెంటర్లలో ఎన్నికైన 12 మంది అమ్మాయిలతో జెమిని టి వి లో 16 ఎపిసోడ్లు చిత్రీకరిస్తారు. ఆ పోటిలో గెలుపొందిన అమ్మాయికి లక్స్ డ్రీమ్ గర్ల్ కిరీటంతో పాటు మంచు విష్ణువర్థన్ సరసన హీరోయిన్ గా అవకాశం కూడా లభిస్తుంది. ఈ కార్యక్రమానికి నటి స్నేహ మేంటర్ గానూ, యస్.గోపాల రెడ్డి, హేమంత్ మధుకర్ జడ్జిలుగానూ, నటి నిఖిత యాంకర్ గానూ వ్యవహరిస్తారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com