Home

»

Latest News

వైజాగ్ లో రవితేజ "వీర"

Mar 22, 2011 10:55AM

ravi teja wallpapers, ravi teja stills, ravi teja images, ravi teja pics, ravi teja photos, ravi teja pictures స్టీల్ సిటి వైజాగ్ లో రవితేజ "వీర" చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతూంది. శాన్వి ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమెటెడ్ పతాకంపై, రమేష్ వర్మ దర్శకత్వంలో, రవితేజ హీరోగా, గణేష్ ఇందుకూరి ఈ "వీర" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రవితేజ "వీర" చిత్రంలో కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాఖపట్టణంలో హీరో రవితేజ హీరోయిన్ తాప్సిల మీద కొన్ని ముఖ్యమైన సీన్లనూ, రెండు యాక్షన్ సీన్లనూ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు రమేష్ వర్మ గతంలో "రైడ్" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ రవితేజ "వీర" చిత్రంలో "కిక్" చిత్రంలో నటించిన తమిళ నటుడు శ్యామ్ కూడా ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

ఈ రవితేజ "వీర" చిత్రంలో హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్ర "విక్రమార్కుడు" చిత్రంలోని విక్రమ్ రాథోడ్ వంటి శక్తివంతమైన పాత్ర కాగా, మరొకటి సరదాగా ఉండే పాత్ర అని ఫిలిం నగర్‍ వర్గాల కథనం. ఈ రవితేజ "వీర" చిత్రానికి తమన్.యస్. సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రవితేజ "వీర" చిత్రంలో ఇంకా ప్రకాష్ రాజ్, రోజా, నాగబాబు, బ్రహ్మానందం, రాహుల్ దేవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని ఛోటా.కె.నాయుడు నిర్వహిస్తూండగా, గౌతం రాజు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com