మరో మూడు రోజులు నాగచైతన్య మకాం అక్కడే!
on Oct 15, 2020
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో గల ఆర్మూర్ పట్టణంలో! ఆయన అక్కడ ఏం చేస్తున్నారు? అని అనుకుంటున్నారా!? చైతు కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'లవ్ స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఆర్మూర్ పట్టణంలో జరుగుతోంది. గత నాలుగైదు రోజుల నుండి అక్కడ అ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ మరో మూడు రోజుల పాటు జరుగుతుందని తెలిసింది.
నాగచైతన్యతో పాటు కథానాయిక సాయిపల్లవి కూడా ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారని సమాచారం. 'ఫిదా' తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. చిత్రీకరణ దాదాపుగా చివరి దశకు వచ్చింది. డాన్స్ నేపథ్యంలో అందమైన ప్రేమకథను ప్రేక్షకులకు చూపించబోతున్నారు.
Also Read