Home

»

Latest News

ల‌వ్ స్టోరి.. చైత‌న్య ఫ‌స్ట్ మిలియ‌న్ డాల‌ర్ మూవీ!

Sep 27, 2021 12:22PM

 

నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల తీర్చిదిద్దిన 'ల‌వ్ స్టోరి' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డ్రీమ్ ర‌న్ కొన‌సాగుతోంది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత‌ టాలీవుడ్‌లోనే కాకుండా దేశంలోని అన్ని భాషా చిత్రాల‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచేందుకు ఉర‌క‌లు వేస్తోంది. సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ఈ మూవీ ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌నూ అందుకొని మంచి సినిమాగా పేరుతెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా,  ఓవ‌ర్సీస్ మార్కెట్‌లోనూ హ‌వా కొన‌సాగిస్తూ బాక్సాఫీస్ విన్న‌ర్ అనిపించుకుంటోంది 'ల‌వ్ స్టోరి'.

చాలా కాలం త‌ర్వాత థియేట‌ర్ల ద‌గ్గ‌ర హౌస్‌ఫుల్ బోర్డులు క‌నిపిస్తుండ‌టంతో ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఆనందాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఏడాది నుంచి చూసుకుంటే, క‌రోనా మ‌హ‌మ్మారి లాక్‌డౌన్ త‌ర్వాత నుంచి అమెరికాలో మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసిన ఫ‌స్ట్ ఇండియ‌న్ ఫిల్మ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది 'ల‌వ్ స్టోరి'. ఆదివారంతో ఈ సినిమా అక్క‌డ 1 మిలియ‌న్ మార్క్‌ను దాటింది. అక్క‌డ రిలీజ్ చేసిన అన్ని స్క్రీన్ల‌లోనూ మూవీకి ఇప్ప‌టికీ మంచి క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. నాగ‌చైత‌న్య కెరీర్‌లో యు.ఎస్‌.లో మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలుచేసిన తొలి సినిమా 'ల‌వ్ స్టోరి' కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అంతు లేదు.

ఒక ద‌ళిత క్రిస్టియ‌న్ యువ‌కుడు, ఒక అగ్ర‌కుల హిందూ యువ‌తి మ‌ధ్య ప్రేమ‌క‌థ‌ను డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల చెప్పిన విధానం, సామాజిక అంత‌రాలు ఎలా నెగ‌టివ్‌గా ల‌వ్ స్టోరీల‌పై ప్ర‌భావం చూపిస్తాయ‌నే విష‌యంతో పాటు, ఇళ్ల ద‌గ్గ‌ర సొంత బంధువుల వ‌ల్ల అమ్మాయిలు ఎలా లైంగిక వేధింపుల‌కు గుర‌వుతుంటార‌నే మ‌రో సామాజిక స‌మ‌స్య‌ను కూడా చర్చించిన తీరు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను స్పృశిస్తోంద‌ని వ‌సూళ్లు నిరూపిస్తున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com