Home

»

Latest News

ఈ దీపావ‌ళి ర‌జినీకాంత్ తో.. వ‌చ్చే దీపావ‌ళి సూర్య‌తో..!

Sep 27, 2021 11:32AM

గోపీచంద్ హీరోగా న‌టించిన `శౌర్యం`(2008)తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేసిన శివ‌.. క్ర‌మంగా కోలీవుడ్ పై ఫోక‌స్ పెట్టి స్టార్ డైరెక్ట‌ర్ గా ఎదిగాడు. `త‌ల` అజిత్ తో వ‌రుస‌గా నాలుగు సినిమాలు చేసి వార్త‌ల్లో నిలిచాడు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ రజినీకాంత్ ని `అణ్ణాత్త‌`గా చూపే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. `అణ్ణాత్త‌` త‌రువాత మ‌రో కోలీవుడ్ స్టార్ సూర్య‌తో త‌న నెక్ట్స్ వెంచ‌ర్ చేయ‌బోతున్నాడు శివ‌. ద‌స‌రా సంద‌ర్భంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కానున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. వ‌చ్చే సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ బాట ప‌ట్ట‌నుంద‌ని స‌మాచారం. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో సూర్యని నెవ‌ర్ సీన్ బిఫోర్ మాస్ అవ‌తార్ లో చూపించ‌బోతున్నాడ‌ట శివ‌. అంతేకాదు.. 2022 దీపావ‌ళి సీజ‌న్ కి ఈ యాక్ష‌న్ డ్రామాని విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు బ‌జ్.

మ‌రి.. ఈ దీపావ‌ళికి ర‌జినీకాంత్ తో, వ‌చ్చే దీపావ‌ళికి సూర్య‌తో సంద‌డి చేయ‌నున్న శివ‌కి.. ఆయా చిత్రాలు ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తాయో చూడాలి.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com