విజయ్ బర్త్ డేకి లోకేష్ గిఫ్ట్: కమల్ ఫ్యాన్స్ హ్యాపీ!
on Jun 14, 2023

దళపతి విజయ్ బర్త్ డేకి లోకేష్ సూపర్ డూపర్ గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నారు. దీనికి కమల్ ఫ్యాన్స్ ఎందుకు ఖుషీ అవుతున్నారు? అనేదేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రస్తుతం లియో అనే సినిమా చేస్తున్నారు విజయ్. బ్లడీ స్వీట్ అంటూ ఆల్రెడీ రిలీజ్ చేసిన గ్లింప్స్ కి కూడా మంచి స్పందన వస్తోంది. గ్లింప్స్ జనాలకు బోర్ కొట్టకముందే నెక్స్ట్ సూపర్ డూపర్ టీజర్ ప్లాన్ చేస్తున్నారు లోకేష్. దాన్ని ఈ నెల 22న విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ టీజర్‌కి లోకనాయకుడు కమల్ హాసన్ వాయిస్ ఇస్తున్నారన్నది స్పెషల్ న్యూస్. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ లోకే వస్తుంది లియో. లోకేష్ గత చిత్రాల్లోని పలు కేరక్టర్లు ఈ లియోలో కనిపిస్తాయన్నది అందరినీ ఊరిస్తున్న విషయం. లోకేష్ రీసెంట్ హిట్ విక్రమ్. కమల్‌తో చేశారు ఆ మూవీని. ఇప్పుడు లియోలో విక్రమ్ వాయిస్ వినిపించడం వెనుక ఉన్న రహస్యం ఏంటన్నది అందరినీ ఊరిస్తున్న విషయం. ఇప్పటిదాకా విజయ్‌ని రజనీతోనే పోల్చి చూశారు ఫ్యాన్స్. ఫస్ట్ టైమ్ విజయ్ మూవీకి కమల్ కనెక్షన్ అనే మాట ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది.
లియోలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ స్క్రీన్ మీదకు రానుంది. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. విజయ్ తండ్రిగా ఈ సినిమాలో సంజయ్ కనిపిస్తారట. విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. గొడవలకు దూరంగా కశ్మీర్‌లో చాక్లెట్ ఫ్యాక్టరీ నడుపుకుంటున్న అతని జీవితంలో ఏం జరిగిందన్నది ఆసక్తికరం అనే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ మీనన్, అర్జున్ సర్జ, మిస్కిన్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 19న విడుదల కానుంది లియో. తెలుగు, కన్నడ, హిందీలోనూ అనువాద వెర్షన్లు విడుదల కానున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



