ఓటిటి లో లిటిల్ హార్ట్స్.. హిట్ అయితే ఇలాగే ఉంటుంది పరిస్థితి
on Sep 20, 2025

ఎవరి ఊహలకి అందని విధంగా చిన్న చిత్రంగా విడుదలై, ఘన విజయాన్ని అందుకున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం 'లిటిల్ హార్ట్స్'(Little Hearts). ఈ చిత్రం విడుదల సమయంలో ఘాటీ, మదరాసి వంటి భారీ చిత్రాలు రిలీజ్ ఉండటంతో, లిటిల్ హార్ట్స్ ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. కానీ మేకర్స్ ఎంతో ధైర్యంతో ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ని ప్రదర్శించారు. ఇక అంతే, సినిమా బాగుందనే టాక్ రావడం, పైగా ఎలాంటి అసభ్యతకి తావు లేని క్లీన్ ఎంటర్ టైనర్ కావడంతో, యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్స్ కి పోటెత్తారు.
లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ 5 న థియేటర్స్ లో అడుగుపెట్టింది. అంటే మరికొన్ని రోజుల్లో మూడో వారాన్ని కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ టైంలో ఎంత పెద్ద చిత్రమైనా 'ఓటిటి డేట్' ని అనౌన్స్ చేస్తారు. ప్రస్తుత రోజుల్లో సినిమా హిట్ అంటేనే రెండు వారాలనే టాక్ కూడా కొంత మంది ప్రేక్షకుల్లో ఉంది. దీంతో ఓటిటి లవర్స్ 'లిటిల్ హార్ట్స్' 'ఓటిటి' డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తు వస్తున్నారు. ఈ మూవీ ఓటిటి హక్కులు 'ఈటీవీ విన్' దగ్గర ఉన్నాయనే విషయం తెలిసిందే. రీసెంట్ గా ఓటిటి డేట్ పై సదరు సంస్థ మాట్లాడుతు 'లిటిల్ హార్ట్స్ ని ఇప్పట్లో ఓటిటికి తెచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ లెక్కన ఇప్పుడప్పుడే ఓటిటిలోకి అడుగుపెట్టే అవకాశం లేదనే వార్తలు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.
.లిటిల్ హార్ట్స్ ని ఈటీవీ విన్ తో కలిసి 90 's ఫేమ్ ఆదిత్య హాసన్(Aditya hasan)నిర్మించగా బన్నీ వాసు,వంశీ నంది పాటి రిలీజ్ చేసారు. 2 .5 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఇప్పటి వరకు 33 .8 కోట్లు వసూలు చేసింది.కలెక్షన్స్ అయితే ఇంకా స్టడీ గానే ఉన్నాయి. మౌళి తనూజ్(Mouli Tanuj),శివాని నాగారం(Shivani Nagaram)జంటగా చేసారు. సాయి మార్తాండ్(Sai Marthand)దర్శకుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



