'లైగర్'.. రిలీజ్ అప్పుడేనా?
on Jan 24, 2021
'లైగర్'.. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫస్ట్ కాంబినేషన్ లో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా. ఇందులో రౌడీ హీరో.. నెవర్ బిఫోర్ సీన్ రోల్ లో కనిపించనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నాయికగా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ తో అటెన్షన్ పొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ టైమ్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే... ఈ ఏడాది జూలైలో 'లైగర్' విడుదలకు సిద్ధమవుతోందట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ ని చూసిన విజయ్ దేవరకొండ.. 'లైగర్'తో అయినా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి. కాగా, ఇందులో విజయ్ దేవరకొండకి తల్లిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
