'లైగర్' నుంచి మరో అప్డేట్ వచ్చింది
on Jul 6, 2022
ఇటీవల 'లైగర్' మూవీ నుంచి విడుదలైన పోస్టర్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ప్రైవేట్ పార్ట్ కి పూల బొకే అడ్డుపెట్టుకొని ఉన్న విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆగష్టు 25 న విడులవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని ఆ పోస్టర్ తో గ్రాండ్ గా స్టార్ట్ చేసిన మూవీ టీమ్.. తాజాగా ఫస్ట్ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'లైగర్'. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ప్రోమోని జులై 8న, ఫుల్ సాంగ్ ని జులై 11న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను వదిలారు. ఆ పోస్టర్ లో విజయ్ తన చేతి వేళ్ళతో అనన్య చేత విజిల్ వేయిస్తున్నట్లుంది. పోస్టర్ లో విజయ్ ఎనర్జీ చూస్తుంటే మంచి జోష్ ఫుల్ సాంగ్ అనిపిస్తోంది.
విక్రమ్ మాంట్రోస్, తనిష్క్ బాఘ్చి, మణిశర్మ(బ్యాక్ గ్రౌండ్ స్కోర్) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.