Home

»

Latest News

మెగాస్టార్.. ఫెస్టివ‌ల్ స్పెష‌ల్స్!

Jul 6, 2022 5:23PM

రి-ఎంట్రీలో `ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా.. న‌ర‌సింహారెడ్డి`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ రెండు కూడా ఫెస్టివ‌ల్ స్పెష‌ల్ గానే జ‌నం ముందు నిలిచాయి. 2017 సంక్రాంతికి `ఖైదీ నంబ‌ర్ 150` రిలీజ్ కాగా.. 2019 దస‌రా కానుక‌గా `సైరా` సంద‌డి చేసింది. కాగా, రీసెంట్ గా రిలీజైన `ఆచార్య` నాన్ - ఫెస్టివ‌ల్ టైమ్ లో వ‌చ్చి నిరాశ‌ప‌రిచింది. ఈ నేప‌థ్యంలో.. రాబోయే రెండు సినిమాల‌ను కూడా పండ‌గ‌ల ప్ర‌త్యేకంగానే తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు చిరు.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మ‌ల‌యాళ చిత్రం `లూసీఫ‌ర్`కి రీమేక్ గా మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టిస్తున్న పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ `గాడ్ ఫాద‌ర్`. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మ‌రోవైపు.. `గాడ్ ఫాద‌ర్`  త‌రువాత రాబోతున్న `మెగా 154` కూడా 2023 సంక్రాంతి కానుక‌గా సంద‌డి చేయ‌నుంది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ త‌యార‌వుతోంది. మ‌రి.. ఫెస్టివ‌ల్ స్పెష‌ల్స్ గా రాబోతున్న మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఏ స్థాయిలో ఎంట‌ర్టైన్ చేస్తాయో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com