'లైగర్' ఎఫెక్ట్.. 'జనగణమన'కు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్న విజయ్-పూరి!?
on Sep 3, 2022

విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేసిన 'లైగర్' మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూశారు. విడుదలకు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్లు విడుదలయ్యాక వసూళ్లను రాబట్టడంలో దారుణంగా ఫెయిలయ్యింది ఆ మూవీ. నిజానికి 'లైగర్' ట్రైలర్‌ను ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత అనన్యా పాండేతో కలిసి విజయ్ దేశవ్యాప్తంగా తన సినిమాని ప్రమోట్ చేశాడు. వారు వెళ్లిన ప్రతిచోటా అపూర్వ స్వాగతం లభించింది. అయితే సినిమా విడుదలయ్యాక ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ రావడంతో, షోకి షోకీ కలెక్షన్లు ఘోరంగా పడిపోతూ వచ్చాయి.
ఇప్పుడు తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ రెమ్యూనరేషన్‌లో ఎక్కువ భాగాన్ని తిరిగి ఇచ్చేస్తున్నారని కూడా వినిపిస్తోంది.
'లైగర్' డిజాస్టర్ ఎఫెక్ట్.. విజయ్, పూరి కలిసి చేస్తున్న తదుపరి సినిమా 'జనగణమన'పై పడుతున్నట్లు కనిపిస్తోంది. 'లైగర్' బాక్సాఫీస్ దగ్గర కుదేలైపోయిన దగ్గర్నుంచీ, తమకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గొడవ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'జనగణమన'కు తమ రెమ్యూనరేషన్‌ను తగ్గించుకోవాలని విజయ్, పూరి.. ఇద్దరూ డిసైడ్ చేసుకున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 'జనగణమన' కూడా పాన్ ఇండియా ఫిల్మ్ కావడం గమనార్హం.
'లైగర్' ఫలితం చూశాక, 'జనగణమన'కు ముందు అనుకున్న బడ్జెట్‌ను సగానికి సగం తగ్గించుకోవాలని ఆ సినిమా నిర్మాతలు, పెట్టుబడిదారులు డిసైడ్ అయ్యారని, అలా అయితేనే తాము సేఫ్ జోన్‌లో ఉంటామని వారు భావిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ తమ పారితోషికాలను తగ్గించుకుంటున్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



