Home

»

Latest News

`క్రాక్`, `అఖండ‌` బాట‌లో `పుష్ప‌` కూడా వెళుతుందా!

Dec 4, 2021 10:19AM

2021 క్యాలెండ‌ర్ ఇయ‌ర్.. కొన్ని క్రేజీ కాంబినేష‌న్ ల‌కు `హ్యాట్రిక్` ఇయ‌ర్ గా నిలుస్తోంది. ఇప్ప‌టికే రెండు కాంబినేష‌న్స్ హ్యాట్రిక్ కొట్టి వార్త‌ల్లో నిల‌వ‌గా.. మ‌రో కాంబినేష‌న్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `డాన్ శీను` (2010), `బ‌లుపు` (2013) చిత్రాల‌తో త‌మ కాంబినేష‌న్ లో రెండు వ‌రుస విజ‌యాలు చూసిన మాస్ మ‌హారాజా ర‌వితేజ - టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని `క్రాక్` రూపంలో మ‌రో స‌క్సెస్ ని త‌మ ఖాతాలో వేసుకుని `హ్యాట్రిక్ కాంబినేష‌న్`గా నిల‌వ‌గా.. రీసెంట్ గా న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ - మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను కూడా ఆ జాబితాలో చేరారు. `సింహా`(2010), `లెజెండ్` (2014) వంటి సెన్సేష‌న‌ల్ హిట్స్ త‌రువాత ఈ ఇద్ద‌రి కల‌యిక‌లో వ‌చ్చిన `అఖండ‌` తాజాగా థియేట‌ర్స్ లోకి వ‌చ్చి మాస్ జాత‌ర చేస్తూ.. వీరి కాంబోకి `హ్యాట్రిక్`ని అందించింది. ఈ నేప‌థ్యంలో.. `ఆర్య‌` (2004), `ఆర్య 2` (2009) వంటి స‌క్సెస్ ఫుల్ మూవీస్ త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న మూడో చిత్రం `పుష్ప - ద రైజ్` కూడా హ్యాట్రిక్ కొట్టి అదే బాట ప‌డుతుందేమో చూడాలి.

కాగా, డిసెంబ‌ర్ 17న పాన్ - ఇండియా మూవీగా రిలీజ్ కానున్న‌ `పుష్ప - ద రైజ్`.. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఎంట‌ర్టైన్ చేయ‌నుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com