Home

»

Latest News

ఈ భీముడు.. భ‌య‌పెడ‌తాడు

Oct 13, 2016 2:40PM

 

చేతిలో ఐదారు సినిమాల‌తో బిజీ బిజీగా ఉండే హీరో నారా రోహిత్‌.  రాజా చేయి వేస్తే, జ్యో అత్యుతానంద చిత్రాలు ఈ యేడాది విడుద‌ల‌య్యాయి. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు రిలీజ్‌కి సిద్ద‌మైంది.  పండ‌గ‌లా వ‌చ్చాడు, క‌థ‌లో రాజ‌కుమారి సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈలోగా మ‌రో క‌థ‌కి ఓకే చెప్పాడు రోహిత్‌. అదే... భీముడు. ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రం త్వ‌ర‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.  ప్రేమ, ఇష్క్‌, కాద‌ల్‌తో ద‌ర్శ‌కుడిగా నిరూపించుకొన్నాడు ప‌వ‌న్‌. ఆ త‌ర‌వాత నారా రోహిత్ తో సావిత్రి తీశాడు. ఇప్పుడు నారా రోహిత్ మ‌రోసారి సాధినేనికి అవ‌కాశం ఇచ్చాడు. వీరిద్ద‌రి కాంబోలో భీముడు సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఇదో హార‌ర్ క‌థాంశం అని తెలుస్తోంది. హార‌ర్ జోన‌ర్‌లో రోహిత్ సినిమా చేయ‌డం ఇదే తొలిసారి. అయితే ఇప్పుడొస్తున్న హార‌ర్ కామెడీలతో పోలిస్తే భీముడు భిన్నంగా ఉండ‌బోతోంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది.  ప్ర‌స్తుతం చిత్ర‌బృందం క‌థానాయిక కోసం అన్వేషిస్తోంది. ఈ యేడాది చివ‌ర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com