ఫిల్మ్ ప్రొడక్షన్‌లో మరో టాప్ మ్యూజిక్ కంపెనీ
on Jan 22, 2020

కన్నడ చిత్రసీమలో తన పర్ఫార్మెన్సుతో మంచి గుర్తింపు పొందడంతో పాటు, తనదైన ముద్రవేశారు యంగ్ హీరో నిఖిల్ కుమార్. ఆయన తదుపరి సినిమా ఇటీవలే ఖరారైంది. తెలుగు, కన్నడ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఏక కాలంలో ఇది రూపొందనున్నది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించనున్నారు. జనవరి 22 నిఖిల్ కుమార్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని, ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ఈ ఆసక్తికర చిత్రంతో సౌత్ ఇండియాలోనే అగ్రగామి మ్యూజిక్ కంపెనీ అయిన లహరి మ్యూజిక్ సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతుండటం విశేషం.
ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే మొదలు కానున్నది. టాప్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోయిన్, ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది. అందమైన ప్రేమకథ, తగుపాళ్లలో యాక్షన్ మేళవించిన స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తయారవుతుంది. భారీ వ్యయంతో చంద్రు మనోహరన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇటీవలే మరో టాప్ మ్యూజిక్ కంపెనీ ఆదిత్యా మ్యూజిక్ ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టి తొలి యత్నంగా నందమూరి కల్యాణ్ రాంతో 'ఎంత మంచివాడవురా' చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



