శ్రీదేవి ఆత్మ చిన్న కూతురిలోకి ప్రవేశించబోతుందా!
on Mar 10, 2025

భారతీయ సినిమా తన మనుగడ కొనసాగిస్తున్నంత కాలం,భారతీయ సినీ ప్రేమికులు అతిలోక సుందరి 'శ్రీదేవి'(Sridevi)ని మర్చిపోలేరు.అంతలా ఆమె నటప్రస్థానం కొనసాగింది.పెర్ఫార్మెన్సు పరంగాను,డాన్స్ పరంగాను హీరోలకి ధీటుగా నటించి అనేక మంది అభిమానులని సంపాదించుకుంది.ఒక రకంగా వరల్డ్ సినీ ఇండస్ట్రీలోనే బాలనటి స్థాయి నుంచి హీరోయిన్ గా నెంబర్ వన్ స్థాయికి ఎదిగిన నటి శ్రీదేవి తప్ప మరొకరు లేరని కూడా చెప్పుకోవచ్చు.
ఇక శ్రీదేవి చివరగా నటించిన చిత్రం 'మామ్'(Mom).ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కబోతుంది.శ్రీదేవి చిన్న కూతురు 'ఖుషి కపూర్'(Kushi Kapoor)తన తల్లి క్యారక్టర్ ని పోషించబోతుంది.ఈ విషయాన్నీ శ్రీదేవి భర్త, బోనీకపూర్(Boney Kapoor)రీసెంట్ గా జరిగిన ఐఫా(Ifa)ఉత్సవాల్లో వెల్లడించాడు.దీంతో ఖుషి కపూర్ తన తల్లి క్యారక్టర్ లో ఈ మేర రాణిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.2017 లో 'రవి ఉద్యవర్'(Ravi Udyawar)దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'మామ్' లో,శ్రీదేవి అద్భుతంగా నటించి, తన కెరీరి లోనే మరోసారి ది బెస్ట్ పెర్ ఫార్మెన్సు ని ఇచ్చింది.
తనదైన బాడీలాంగ్వేజ్ తో అభిమానుల్లో,ప్రేక్షకుల్లో నవ్వులు కూడా పూయించింది.మూవీ చూసిన ప్రతి ఒకరు శ్రీదేవి ఈజ్ బ్యాక్ అని కూడా ముక్త కంఠంతో చెప్పారు. ఈ నేపథ్యంలో ఖుషి కపూర్ తన తల్లి క్యారక్టర్ లో ఏ మేర రాణిస్తుందనే ఆసక్తి అందరిలో కలుగుతుంది. ఖుషి కపూర్ ఇప్పటికే ఆర్చీస్, లవ్ యాపా లాంటి డిఫరెంట్ మూవీస్ లో నటించి తల్లి తగ్గ వారసురాలని అనిపించుకుంది.'మామ్' ని నిర్మించిన బోనీ కపూర్ సీక్వెల్ ని కూడా నిర్మిస్తుండగా మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్(Jahnvi Kapoor)ఎన్టీఆర్(Ntr)తో చేసిన దేవర(Devara)ద్వారా ప్రేక్షకులని మెప్పించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan)తో కలిసి ఆర్ సి 16 లో చేస్తుంది.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



