తొలిరోజే రూ.30.1 కోట్లు కొల్లగొట్టిన ‘ఖుషి’లో చిత్ర యూనిట్!
on Sep 2, 2023

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘ఖుషి’ కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. తొలిరోజు ఇంత భారీగా కలెక్ట్ చేయడం విజయ్ కెరీర్‌లోనే తొలిసారి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ‘ఖుషి’ తొలి షో నుంచి సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. పాజిటివ్ టాక్ రావడంతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకు వెళ్తున్నారు.
యుఎస్‌లో కూడా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది ‘ఖుషి’. యుఎస్‌లో 8 లక్షల డాలర్లు వసూలు చేసి అందరితోనూ వావ్ అనిపించుకుంటోంది ‘ఖుషి’. ఈ సినిమాకి సరైన పోటీ లేకపోవడం కూడా బాగా కలిసొచ్చింది. కలెక్షన్లపరంగా ముందు ముందు మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి విజయ్, సమంత, శివ నిర్వాణ హిట్ ట్రాక్‌లోకి వచ్చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



