Home

»

Latest News

హెబ్బాని మళ్ళీ ఎడిపిస్తానంటున్న సింగర్!

Jun 30, 2016 12:41PM

"కుమారి 21F" సినిమాలో హీరోయిన్  హెబ్బాపటేల్ ను ఏడిపించి ఏడిపించి.. చివరాఖరున రేప్ చేసి తన పైశాచికత్వాన్ని చూపించుకొన్న రౌడీ పాత్రలో నటించిన సింగర్ కమ్ ర్యాపర్ నోయల్ మరోమారు కుమారిని అదేనండి హెబ్బాను ఎడిపిస్తానంటున్నాడు. హెబ్బా నటిస్తున్న తాజా చిత్రం "నేను నా బోయ్ ఫ్రెండ్స్". వివి వినాయక్ అసిస్టెంట్ భాస్కర్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ న్యూ యేజ్ రోమాంటిక్ థ్రిల్లర్ లో నోయల్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడట. హెబ్బాకు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇచ్చే ఆటగాడిగా నియోల్ నటించనున్నాడు. అతగాడి వద్దకు ట్రైనింగ్ కు వచ్చిన హెబ్బాను ఎడిపిస్తుంటాడట నోయల్. మరి హెబ్బా అతడి బారి నుంచి ఎలా తప్పించుకుందో చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com