Home

»

Latest News

లండన్ లో ఆలియా రొమాన్స్!

Jun 30, 2016 12:26PM

 

"ఉడ్తా పంజాబ్" సినిమా రిలీజయ్యాక కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకొన్న ఆలియా లండన్ పయనమైన విషయం తెలిసిందే. అయితే.. అమ్మాయిగారు లండన్ సింగిల్ గా వెళ్ళలేదట, తన బోయ్ ఫ్రెండ్ సిద్దార్త్ మల్హోత్రాతో కలిసి వెళ్లిందట. బాంబేలో అయితే హ్యాపీగా తిరగడం కుదరడం లేదు, ముఖ్యంగా మీడియా ఫోటోగ్రాఫర్ల కెమెరా కంటికి చిక్కకూడదని నానా హైరానా పడిపోతున్నారు. ఈ గోలంతా ఎందుకు అనుకొన్నారో ఏమో లండన్ కి జంప్ అయిపోయారు.

అయితే.. బాలీవుడ్ తారాలన్నాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది కదా.. ఆలియా-సిద్దార్త్ లకు లండన్ లో ఆ గుర్తింపు చిక్కులు తెచ్చిపెట్టింది. అక్కడవారిని జంటగా చూసినవారెవరో వారిద్దరి ఫోటోలను ఫేస్ బుక్, ట్విట్టర్ లో పెట్టేశారు. దాంతో ఆలియా లండన్ ప్రయాణం వెనుక ఉన్న ఆంతర్యం అందరికీ అర్ధమైపోయింది! 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com