Home

»

Latest News

రాజుగాడితో బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్ !

Jun 30, 2016 1:08PM

 

రాజ్ తరుణ్ ఫిలిమ్ నగర్ లో తిరుగుతున్నప్పుడు ఏ నక్క తోకో తోక్కెసి ఉంటాడు లేకపోతే.. నిన్నటివరకూ లోకల్ హీరోయిన్లతో నటించిన మనోడి సరసన వరుసబెట్టి బాలీవుడ్ హీరోయిన్లు నటించడం ఏమిటి. ఇప్పటివరకూ నటించిన అయిదు సినిమాల్లో రెండు ఆవికాగోర్ తో, మరో రెండు హెబాపటేల్ తో కానిచ్చిన రాజ్ తరుణ్.. "రామయ్య అందాలు.." సినిమాలో మాత్రం మలయాళ కుట్టి అర్థనను పరిచయం చేశాడు. 

ఇప్పుడు మనోడి సుడి తిరిగి.. ఒక సినిమాలో "అఖిల్" ఫేమ్ సాయేషా, మరో సినిమాలో బాలీవుడ్ హాట్ ప్రాపర్టీ అమైరా దస్తూర్ తో రొమాన్స్ చేయనున్నాడు. వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంకా టైటిల్ పెట్టని సినిమాలో సాయేషా హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజనా రెడ్డి అనే లేడీ డైరెక్టర్ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రాజ్ తరుణ్ నటిస్తున్న "రాజు గాడు" సినిమాలో హీరోయిన్ గా "అమైరా దస్తూర్"ను ఎంపిక చేశారని తెలుస్తోంది. 

కాగా.. అమైరా దస్తూర్ నిజానికి రామ్ చరణ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా.. అప్పట్లో ట్రైల్ షూట్ అనంతరం దర్శకనిర్మాతలు ఆమెను రిజెక్ట్ చేశారు!   

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com