'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ వచ్చేసింది
on Mar 7, 2022

యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కృష్ణ వ్రింద విహారి'. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనీష్ ఆర్ కృష్ణ దర్శకుడు. షిర్లీ సేఠియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ తాజాగా మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే విడుదలైన 'కృష్ణ వ్రింద విహారి' ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నుదుటిన నిలువు బొట్టుతో ఉన్న నాగశౌర్య లుక్ ఆకట్టుకుంది. ఇక తాజాగా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ని వదిలారు. అందులో ఓ పాత స్కూటర్ పై హీరో హీరోయిన్ జాలీగా వెళ్తున్నారు. అది ఓ సాంగ్ లో స్టిల్ అని అర్థమవుతోంది. ఈ పోస్టర్ లో కూడా నాగశౌర్య నుదుటిన బొట్టుతో కనిపిస్తున్నాడు. ఏప్రిల్ 22 న ఈ సినిమాకి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

'అలా ఎలా' సినిమాతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే మెప్పించిన అనీష్ ఆర్ కృష్ణ.. ఆ తర్వాత డైరెక్ట్ చేసిన 'లవర్', 'గాలి సంపత్' సినిమాలతో నిరాశపరిచాడు. మరి ఇప్పుడు 'కృష్ణ వ్రింద విహారి' సినిమాతో మరోసారి సత్తా చాటుతాడేమో చూడాలి.
రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



