హీరోయిన్ గా కృష్ణ మనవరాలు!.. హీరో ఇతనే అనేది నిజమా!
on Aug 20, 2025

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'సూపర్ స్టార్ కృష్ణ'(Krishna)సినీప్రస్థానానికి ఉన్న 'చరిష్మా' గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎన్నో సాహసాలతో తెలుగు సినిమాని వేగంతో పరుగెత్తించి, కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించాడు. ప్రపంచ సినీ చరిత్రలో 320 కి పైగా సినిమాల్లో హీరోగా చేసిన రికార్డు 'కృష్ణ' సొంతం. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఈ రికార్డుని ఇంకో హీరో టచ్ అవకాశాలు లేవు.
సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా 'కృష్ణ' పెద్దకుమారుడు 'రమేష్ బాబు'(Ramesh Babu)కుమార్తె 'భారతి'(Bharathi)హీరోయిన్ గా పరిచయం కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు 'భారతి' ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సదరు చిత్రంలో ప్రముఖ దర్శకుడు 'తేజ' కుమారుడు 'అమితవ్'(Amitov)హీరోగా చేస్తున్నాడని, తేజ(Teja)దర్శకత్వంలోనే 'ప్రేమకథ'గా తెరకెక్కబోతుందనే న్యూస్ కూడా వినపడుతుంది. 'అభినవ్' హీరోగా 'విక్రమాదిత్య' టైటిల్ తో తేజ ఒక ప్రాజెక్ట్ కి సన్నాహాలు మొదలుపెట్టాడనే వార్తలు మాత్రం కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి.
ఇక రమేష్ బాబు కుమారుడు 'జయకృష్ణ' హీరోగా పరిచయం కాబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారంగా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో జయకృష్ణ సోదరి 'భారతి' సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన న్యూస్ ఆసక్తికరంగా మారింది. భారతి తండ్రి రమేష్ బాబు హీరోగా పలు చిత్రాల్లో చేసి, అభిమానులతో పాటు ప్రేక్షకులని మెప్పించాడు. నిర్మాతగాను సోదరుడు మహేష్ బాబు(Mahesh Babu)తో 'అర్జున్' వంటి హిట్ మూవీని నిర్మించాడు. గతంలో కృష్ణ కూతురు 'మంజుల'(Manjula Ghattamaneni)హీరోయిన్ గా పరిచయం కాబోతుందని ప్రకటన వస్తే అభిమానులు,ఆ ప్రకటన వెనక్కి తీసుకునే దాకా ఆందోళన చేసారు. దీంతో మంజులని కృష్ణ హీరోయిన్ గా పరిచయం చెయ్యలేదు. భారతి సినీ రంగ ప్రవేశానికి సంబంధించి వార్తలు వస్తున్న నేపథ్యంలో పలువురు నెటిజన్స్ గతంలో జరిగిన మంజుల సంఘటనని గుర్తు చేసుకుంటున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



