ఎట్టకేలకు ఓటీటీలోకి 300 కోట్లరూపాయిల సినిమా.. తెలుగులో కూడా
on Oct 15, 2025
.webp)
కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా తుఫాన్ వచ్చేముందు ప్రకృతి ఎంత సైలెంట్ గా ఉంటుందో, అంతే సైలెంట్ గా థియేటర్స్ లోకి అడుగుపెడతాయి. కానీ ఆ తర్వాత సదరు చిత్రం సాధించే విజయం ముందు తుఫాన్ సైతం చిన్నబోతుంది. అలాంటి ఒక చిత్రమే ఆగస్ట్ 28 న వరల్డ్ వైడ్ గా విడుదలైన 'కొత్త లోక చాప్టర్ 1'(Kotha LOkah Chapter 1).వందల ఏళ్ళ నాటి యక్షలోకానికి చెందిన స్త్రీ, ప్రస్తుత సమాజంలో ఇంకా జీవించి ఉంటేఎలా ఉంటుంది అనే కొత్త పాయింట్ తో తెరకెక్కింది. 24 క్రాఫ్ట్స్ మొత్తం ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ చెయ్యడంతో పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి అడుగుపెడుతుందా అని పాన్ ఇండియా ఓటిటి మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓటిటి డేట్ గురించి వార్తలు వస్తున్నా అవి కేవలం రూమర్స్ మాత్రమే. ఇప్పుడు ఆ రూమర్స్ కి చెక్ పెడుతు కొత్త లోక త్వరలోనే ఓటిటి లోకి రాబోతుంది. ఈ విషయాన్నీ ద్రువీకరిస్తు కొత్తలోక ఓటిటి హక్కులని పొందిన 'డిస్నీహాట్ స్టార్'(Disny Hot star)అధికారకంగా ప్రకటించింది. అయితే ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. అతి త్వరలోనే రిలీజ్ తేదీని రివీల్ చేస్తామని ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. దీపావళి కానుకగా స్ట్రీమింగ్ కి రావచ్చని తెలుస్తోంది.
మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో ఒక రేంజ్ సక్సెస్ ని అందుకున్న కొత్తలోక ఓటిటి లో ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఇంకా కొన్ని ఏరియాల్లో స్ట్రాంగ్ కలెక్షన్స్ నే రాబడుతుండగా, ఇప్పటికి వరకు మూడువందల కోట్ల రూపాయిలకి పైగా కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఘనత సాధించిన తొలి మలయాళ మూవీ కూడాను. యక్షిణి గా కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan)తన వన్ మాన్ షో తో అలరించగా నస్లేన్, శాండీ మాస్టర్ ,విజయరాఘవన్, సంధు సలీంకుమార్, రఘునంద పలేరి, శివాజిత్ పద్మనాభన్, జైన్ ఆండ్రూస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ నిర్మాత కాగా డొమినిక్ అరుణ్(Dominic Arun)దర్శకుడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



