Home

»

Latest News

Varun Tej: కొరియన్ కనకరాజు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!

Jun 8, 2026 12:27PM

 


వరుస పరాజయాలతో దూసుకుపోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)ఈ సారి ఎలాగైనా పరాజయాలకి సెండ్ ఆఫ్ చెప్పాలనే పట్టుదలతో చేస్తున్న మూవీ 'కొరియన్ కనకరాజు(korean kanakaraju). వరుణ్ లాగానే హిట్ కోసం ఎదురుచూస్తున్న  వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ  దర్శకుడు. ఈ వినూత్నమైన కాంబో పై అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి. వినోదాత్మక అంశాలతో పాటు హర్రర్, కామెడీ ఎలిమెంట్స్‌తో మేకర్స్ అత్యంత  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన  రిలీజ్డేట్ పై  ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

 'కొరియన్ కనకరాజు'ని ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు  చేస్తున్నట్టుగా టాక్ .మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ ని ప్రకటించనప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఆగస్టు 7 రిలీజ్ డేట్ హాట్ టాపిక్‌గా మారింది. జూన్ మూడో వారంలో గ్లింప్స్‌ని రిలీజ్  చేయడానికి ప్లాన్ చేస్తుండటంతో, అదే రోజు రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా  తెలుస్తోంది. 

మూవీ  కథాంశం విషయానికి వస్తే భారతదేశంతో పాటు కొరియా దేశాల నేపథ్యంలో సాగడం ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. రీసెంట్‌గా ఈ మూవీ నుండి 'కమ్సహమ్నిద' అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ బిహైండ్ ది సీన్స్ వీడియోని  మేకర్స్ విడుదల చేయగా, అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. కథలో కొరియన్ భాషకి , కొరియా దేశ నేపథ్యానికి ఉన్న అసలు సంబంధం ఏమిటనే ప్రశ్న ఇప్పుడు మెగా అభిమానులతో పాటు సగటు సినిమా లవర్స్‌లో  ఉత్కంఠని రేకెత్తిస్తోంది. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని విధంగా మాస్, రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన కెరీర్‌లోనే ఇదొక సరికొత్త, అత్యంత ప్రత్యేకమైన క్యారక్టర్  అని చిత్ర యూనిట్ చెబుతోంది.


Also read: karuppu: వీరభద్రుడు ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే!

 వరుణ్ తేజ్ సరసన మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ జత కడుతుండగా  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. 'తొలిప్రేమ' వంటి సూపర్ హిట్ తర్వాత వరుణ్ తేజ్, తమన్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో సాంగ్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కొరియన్ కనకరాజు వరుణ్ ప్లాప్స్ కి చరమగీతం పడుతుందేమో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com