అదరగొడుతున్నశివ కలెక్షన్స్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ వైరల్
on Nov 14, 2025

-థియేటర్స్ లో శివ సందడి
-కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ వైరల్
-సోషల్ మీడియాలో వైరల్
ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ వద్ద కింగ్ నాగార్జున 'శివ'(Shiva)రీ రిలీజ్ తో సందడి చేస్తున్నాడు. అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్స్ కి భారీగా పోటెత్తడంతో థియేటర్స్ కలకలలాడుతున్నాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శివ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి(Chiranjeevi)అల్లుఅర్జున్, ఎన్టీఆర్, రాజమౌళి,ప్రభాస్, మహేష్ బాబు వంటి వారు నాగార్జున కి బెస్ట్ విషెస్ చెప్పిన విషయం తెలిసిందే.
రీసెంట్ గా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy venkat reddy)ఎక్స్ వేదికగా స్పందిస్తు 'శివ మూవీ తెలుగు సినీ పరిశ్రమని పూర్తిగా కొత్త దిశలో నడిపించింది.నాగార్జున నటన, స్టైల్, స్క్రీన్ ప్రెజన్స్ అన్ని తరాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఏఎన్ఆర్ గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తు ఇండస్ట్రీ పురోగతికి నాగార్జున చేసిన కృషి అద్భుతం. శివ తర్వాత అన్నమయ్య, రామదాసు, షిర్డీ సాయి వంటి విభిన్న సినిమాలు చేసి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసాడు. నాగార్జున ప్రభావం ముందు తరం హీరోలపై ఖచ్చితంగా ఉంటుందని ట్వీట్ చేసాడు. సదరు ట్వీట్ కి నాగార్జున కూడా స్పందిస్తు టైం ఉంటే సినిమా చూడాలని కోరాడు.
Also read: ప్రీ రిలీజ్ బిజినెస్ లో జననాయగన్ రికార్డు
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



