Home

»

Latest News

బాహుబ‌లిని కాపీ కొట్టిన కోడి

Oct 15, 2016 10:30AM


తెలుగు సినిమాల‌కు సంబంధించినంత వ‌ర‌కూ ద‌ర్శ‌క దిగ్గ‌జం అని పిలుచుకోవొచ్చు మ‌న కోడి రామ‌కృష్ణ‌ను. ఆయ‌న్నుంచి అలాంటి సినిమాలొచ్చాయి. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి సోషియో ఫాంట‌సీ వ‌ర‌కూ అన్ని ర‌కాల సినిమాల్నీ తీశారాయ‌న‌. అమ్మోరు, అరుంథ‌తి లాంటి సినిమాల‌తో గ్రాఫిక్స్ వాడ‌కం ఎలా ఉండాలో చూపించారు.  కోడి రామ‌కృష్ణ పాత సినిమాల్ని చూసి స్ఫూర్తి పొందాల్సిన త‌రుణం ఇది. ఇలాంటి ద‌శ‌లో కోడి కాస్తా కాపీ కొట్టేశారంటే న‌మ్మ‌గ‌ల‌మా?   కోడి రామ‌కృష్ణ తాజా చిత్రం నాగ‌భ‌ర‌ణం చూస్తే అలాంటి అనుమానాలే క‌లుగుతాయి. క‌థ విష‌యంలో అఖిల్‌, రుద్ర‌మ‌దేవి, అరుంథ‌తి సినిమాల్ని కాపీ కొట్టారు కోడి రామ‌కృష్ణ‌. అరుంథ‌తి ఆయ‌న సినిమానే కాబ‌ట్టి క్ష‌మించేయొచ్చు.  ఈ సినిమాలోని కొన్ని ఆర్‌.ఆర్ బిట్లు నేరుగా బాహుబ‌లి నుంచి ఎత్తేసిన‌వే. బాహుబ‌లి అభిమానుల‌కు ఆ విష‌యం చాలా ఈజీగా అర్థ‌మ‌వుతుంది. నాగ‌భ‌ర‌ణం ప్రెస్ మీట్ల‌లో కోడి రామ‌కృష్ణ బాహుబ‌లి గురించి కొన్ని ఆస‌క్తికర‌మైన కామెంట్లు చేశారు. బాహుబ‌లిలో గ్రాఫిక్స్ త‌ప్ప క‌థ లేద‌ని, గ్రాఫిక్స్ కోసం సినిమా తీయ‌కూడ‌ద‌ని, క‌థ‌లో భాగంగా రావాల‌ని ఏవేవో సూక్తులు చెప్పారు. అలా నీతులు చెప్పిన ఈ పెద్దాయ‌న పాత సినిమాల్ని కాపీ కొట్టి ఓ సినిమా తీస్తే ఎలా మ‌రి? అందుక‌నేనేమో ఈ సినిమాకి రిజ‌ల్ట్ కూడా అంతే ఘోరంగా వ‌చ్చింది. ఈ సినిమాని డిజాస్ట‌ర్ల లిస్టులో చేర్చేశారు సినీ విశ్లేష‌కులు. ఇలాంటి సినిమా కోడి రామ‌కృష్ణ నుంచి వ‌స్తుంద‌ని ఊహించ‌లేద‌ని ఆయ‌న ఒక‌ప్ప‌టి అభిమానులు కూడా ఉసూరుమంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com