Home

»

Latest News

సునీల్ కి దెబ్బ‌మీద దెబ్బ‌

Oct 15, 2016 10:38AM

 

పాపం సునీల్‌కి ఫ్లాపుల మీద ఫ్లాపులు త‌గులుతున్నాయి. భీమ‌వ‌రం బుల్లోడు త‌ర‌వాత క‌నీసం ఒక్క యావ‌రేజ్ కూడా సునీల్ ఖాతాలో ప‌డ‌లేదు. వ‌రుస‌గా అన్నీ డిజాస్ట‌ర్లే. జ‌క్క‌న, కృష్ణాష్ణ‌మి ఫ్లాపుల‌య్యాయి. ద‌స‌రాకి వ‌చ్చిన ఈడు గోల్డెహె ప‌రిస్థితి ఇంకా ఘోరాతి ఘోరంగా త‌యారైంది. ఈ సినిమాకి ప‌బ్లిసిటీ ఖ‌ర్చులు కూడా వెన‌క్కి రాలేదు. ఈ వ‌రుస ప‌రాజ‌యాలు సునీల్ కెరీర్‌పై ప్ర‌భావం చూపించ‌డం మొద‌లెట్టాయి. ఆయ‌న చేతిలో ఉన్న సినిమాలూ మెల్ల‌మెల్ల‌గా జారుకొంటున్నాయి. ఎన్‌.శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో టూ కంట్రీస్ రీమేక్ లో సునీల్ క‌థానాయ‌కుడిగా న‌టించాల్సింది. ఈ సినిమా లాంఛ‌నంగా కొబ్బ‌రికాయ్ కూడా కొట్టుకొంది. అయితే.. ఈ సినిమా సునీల్ చేతిలోంచి జారిపోయింది. ఈడు గోల్డ్ ఎహె.. ఫ్లాప్ అవ్వ‌డంతో నిర్మాత‌లు డ్రాప్ అయ్యార‌ట‌. సునీల్ వ‌ద్దు.. మ‌రో హీరో చూసుకొందామ‌న్న ఆలోచ‌న‌లో ఉన్నార్ట‌. ఇలాంటి ఫ్లాపు ఇంకోటి ప‌డితే... సునీల్ ఇక పూర్తిగా ఖాళీ అయిపోయిన‌ట్టు. ఆ త‌ర‌వాత ఇది వ‌ర‌క‌టిలా కామెడీ రోల్స్ ట్రై చేసుకోవ‌డం త‌ప్ప మ‌రో మార్గం ఉండ‌దేమో?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com