కలర్, ఎక్స్‌పోజింగ్ చెయ్యాలి.. అప్పుడే షో కి పిలుస్తాను
on Aug 16, 2025

తెలుగు 'బిగ్ బాస్ సీజన్ 6 'లో పాల్గొన్న ప్రముఖ నటి 'కీర్తి భట్'(Kirti Bhatt). ఈ షో ద్వారా ఎంతో మంది అభిమానులని సంపాదించుకొని దాదాపుగా 'విన్నర్' అయినంత పని చేసింది. కానీ ఫైనలిస్ట్‌గా నిలిచింది. బుల్లితెరపై 'మనసిచ్చిచూడు, కార్తీక దీపం, మధురానగరి వంటి సీరియల్స్ తో నటిగా తన సత్తా చాటిన కీర్తి మరిన్ని సీరియల్స్ ద్వారా ప్రేక్షకులని తన నటనతో మెస్మరైజ్ చేయనుంది.
రీసెంట్ గా కీర్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు బిగ్‌బాస్ సీజన్ 6(Big boss season 6) కంప్లీట్ అయ్యాక, నిర్వాహకులు BB అవార్డ్స్ అనే కార్యక్రమం చేశారు. ఫైనలిస్ట్ గా నిలిచినా నన్ను పిలవలేదు. అప్పుడు నాకు అర్ధమైంది ఏంటంటే, షోలకి వెళ్లాలంటే ఇష్టమొచ్చినట్టు మాట్లాడి కంటెంట్ క్రియేట్ చేయాలి. గ్లామరస్ గా ఉండటంతో పాటు, ఎక్స్ పోజింగ్ చేయాలి. మంచి రంగు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే షో లకి పిలుస్తారు. అవన్నీ చెయ్యడం నా వల్ల కాదని కీర్తి చెప్పుకొచ్చింది.
2017 లో జరిగిన ఒక కారు ప్రమాదంలో అమ్మ, నాన్న, అన్న, వదిన, అన్నపిల్లలు, ఇలా కుటుంబం మొత్తాన్ని కీర్తి పోగొట్టుకుంది. తను మాత్రం తీవ్రగాయాలతో, కొన్ని రోజుల పాటు కోమాలో ఉండి ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొని, తన నటన ద్వారా అభిమానులని రంజింపచేస్తున్న కీర్తికి, 2023 లో కన్నడ నటుడు విజయ్ కార్తీక్ తో ఎంగేజ్మెంట్ జరగగా, 2017 లో 'ఐస్ మహల్' అనే చిత్రం ద్వారా కీర్తి నటనా వృత్తిలోకి ప్రవేశించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



