
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)గత నెల తిమ్మరాజు పల్లి టీవీతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథ నేపథ్యం బాగున్నా స్క్రీన్ ప్లేతో లోపల వల్ల తిమ్మరాజు పల్లి ఆశించినంత విజయాన్ని అందుకోలేక పోయింది. ఇప్పుడు అబ్బవరం దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇప్పడు ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం
'రియాలిటీ'(Reality)అనే పేరుతో కూడిన టైటిల్ తో అబ్బవరం దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలు పెట్టనున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. తన కెరీర్ బిగ్గెస్ట్ హాట్ 'క' మూవీ ముందు చిన్న సినిమాల విషయంలో ఎంతో ఆవేదన చెందటంతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలపై తన గళాన్ని విప్పాడు. మరి ఇప్పుడు 'రియాలిటీ' మూవీ సినీ పరిశ్రమకి సంబంధించి ఉంటుందా అనే ఆసక్తి అందరిలో మొదలయింది.అదే టైంలో తను రియాలిటీ లో ఉంటాడా లేక వేరే వాళ్ళు ఉంటారా అనేది చూడాలి.
Also read: Trisha: త్రిష రీసెంట్ పోస్ట్ వైరల్.. విజయ్ తో బంధంపై వివరంగా క్లారిటీ ఇచ్చేసింది
సాధారణంగా హీరోలు సక్సెస్ ట్రాక్‌లో ఉన్నప్పుడు దర్శకత్వం జోలికి వెళ్లడం రిస్క్ అని భావిస్తారు. కానీ, అబ్బవరం తనపై తనకు ఉన్న నమ్మకంతో ఈ సాహసం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన రాసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ,సినిమాల రైటింగ్ వర్క్ చూసిన వారు, కిరణ్ ఖచ్చితంగా మంచి దర్శకుడిగా రాణిస్తారని అభిప్రాయపడుతున్నారు. అబ్బవరం గతంలో తాను చేసిన కొన్నిసినిమాలకి స్వయంగా కథ, డైలాగ్స్ అందించిన విషయం తెలిసిందే.






