నాకు రాజకీయం ఇంకా అబ్బలేదు..పెళ్లయ్యాక అయినా కలిసొస్తుందా!
on Oct 19, 2024

ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(kiran abbavaram)దివాళి కానుకగా ఈ నెల 31 న 'క'(ka)అనే మూవీతో రాబోతున్నాడు.1970 వ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి సుజీత్, సందీప్(sujith and sandeep)ల ద్వయం దర్శకత్వం వహిస్తుంది. తన్వి రామ్, నయన్ సారిక హీరోయిన్ గా చేస్తుండగా చింతా గోపాల కృష్ణ రెడ్డి నిర్మిస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ టీజర్ 'క' పై కిరణ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
రిలీజ్ డేట్ కి దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని షురూ చేసింది.ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కిరణ్ మాట్లాడుతూ పరిశ్రమలో ఎదగాలంటే కొంచం లౌక్యం తెలిసుండటంతో పాటు రాజకీయం కూడా తెలిసి ఉండాలి.కానీ అవి నాకు ఇంకా అబ్బలేదు.కెరీర్ ప్రారంభం నుంచి మంచి కథలే ఎంచుకున్నా కూడా ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో తేడా వస్తుంది.మొదటి రెండు సినిమాలు నేనే అని చూసుకున్నాను.కానీ ఆ తర్వాత నా పాత్ర వరకే చూసుకొని మిగతావి వదిలేసాను.అందుకే అవి విజయం సాధించలేకపోయాయి.కానీ ఇప్పుడు 'క' మూవీ కి అన్ని చూసుకొని జాగ్రత్తగా చేశాను. ఇలా చెయ్యడం వల్ల చాలా ఒత్తిడికి గురవుతున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

2019 లో వచ్చినా రాజా వారు రాణి వారు అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన కిరణ్ ఇప్పటి వరకు ఎనిమిది చిత్రాల్లో నటించగా వాటిల్లో చాలా వరకు పరాజయం పాలయ్యాయి. చివరిగా రూల్స్ రంజన్ తో రాగా ఇటీవలే తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్(rahasya gorak)ని వివాహం చేసుకున్నాడు.వివాహం చేసుకున్న తర్వాత వస్తున్న సినిమా 'క'.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



