Home

»

Latest News

చిరు దూకుడు.. మామూలుగా లేదు

Oct 24, 2016 3:30PM

చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150 మార్కెట్‌, ఆ సినిమాని బ‌య్య‌ర్లు కొంటున్న విధానం చూస్తుంటే ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. అన్ని ఏరియాల నుంచీ క‌నీ వినీ ఎరుగ‌ని రేట్ల‌కు ఈ సినిమాని కొన‌డానికి బ‌య్య‌ర్లు ముందుకు వ‌స్తున్నారు. నైజాంలో ఈ సినిమా రూ.22 కోట్లకు అమ్ముడుపోనున్న‌దని టాక్‌. తూర్పు, ప‌శ్చిమ‌ల్లో కూడా రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లుకుతోంది. టోట‌ల్‌గా ఖైదీ నెం.150 మార్కెట్ బాహుబ‌లి 1 మార్కెట్ కి స‌రిస‌మానంగా ఉండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. చిరు రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అయ్యాక‌... త‌న ఇమేజ్ దారుణంగా డామేజ్ అయ్యింది.

చిరు మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌చ్చినా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు అని నాన్ మెగా ఫ్యాన్స్ జోకులు వేసుకొన్నారు. అయితే... వాట‌న్నింటినీ తాజా ప‌రిణామాలు తిప్పి కొడుతున్న‌ట్టు అవుతున్నాయి. ఖైదీ నెం.150కి మార్కెట్ ప‌రంగా ఇంత క్రేజ్ వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఆఖ‌రికి  చిత్ర‌బృందం కూడా. రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ విష‌యంలో ప‌క్కా వ్యూహంతో ఉన్నాడ‌ని టాక్‌. బాహుబ‌లి మార్కెట్‌ని కొల్ల‌గొట్టాల‌న్న ఉద్దేశంతోనే ఈ సినిమాని అత్య‌ధిక ధ‌ర‌కి అమ్ముతున్నాడ‌ని చెబుతున్నారు. సినిమా హిట్ట‌యితే.. ఫ‌ర్వాలేదు. లేదంటే అంద‌రికీ బొమ్మ క‌న‌ప‌డ‌డం ఖాయం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com