Home

»

Latest News

ఏజెంట్ శివ ఇలా ఉంటాడు..?

Oct 24, 2016 12:49PM

తమిళస్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..హైదరాబాద్‌లో చాలా స్పీడుగా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు మురుగదాస్. ఈ సినిమాకు టైటిల్‌ ఫలానా అని ఇంకా ఫిక్స్‌ అవ్వలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం తలా ఒక టైటిల్ పెట్టేసుకుంటున్నారు. తాజాగా ఏజెంట్ శివ అని టైటిల్ పెట్టేసుకున్నారు. ఇదిలా ఉంటే సినిమాలో తమ అభిమాన నటుడు ఎలా ఉండబోతున్నాడని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీనిలో భాగంగా దీపావళి కానుకగా సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది.

అయితే అందుకు ముందే ఫస్ట్‌లుక్ బయటకు వచ్చేసింది. ఎలాగంటారా ఈ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేస్తున్న సంతోష్ శివన్ మహేశ్ లుక్‌ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. స్కూలు చిన్నారుల మధ్య సూపర్‌స్టార్ నిలుచుని ఉన్న ఆ పిక్‌లో మహేశ్ ఎప్పటిలాగే స్మార్ట్‌గా ఉన్నా..ఫిట్‌నెస్‌‌లో మాత్రం కాస్త వేరియేషన్ కనిపిస్తోంది. ఈ పోస్ట్ అఫిషియల్‌గా రిలీజ్‌కాకపోయినా మహేశ్‌ని ఈ గెటప్‌లో చూసిన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com