Home

»

Latest News

బాహుబ‌లి రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టిన మహేష్‌

Oct 24, 2016 3:33PM

బాహుబ‌లి... తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని అమాంతం పెంచింది. ఆసినిమాని అందుకోవడం దాదాపు అసాధ్యం అన్న భావ‌న క‌లుగుతోంది. అయితే.. మ‌హేష్ బాబు లాంటి స్టార్ల సినిమాలు మాత్రం బాహుబ‌లితో పోటీ ప‌డ‌డానికి, ఆ రికార్డుల్ని అందుకోవ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. తాజాగా మహేష్ బాబు సినిమా బాహుబ‌లి రికార్డ్ ఒక‌దాన్ని బ‌ద్ద‌లు కొట్టింది. అదీ.. శాటిలైట్ రైట్స్ విష‌యంలో. మ‌హేష్ బాబు - మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఏజెంట్ శివ అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ఈ సినిమాకి అప్పుడే తెలుగులో శాటిలైట్ కి బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు టాక్‌.

జీ తెలుగు మ‌హేష్‌ సినిమా కోసం రూ.16 కోట్లు కోడ్ చేసింద‌ట‌. ఫ్యాన్సీ ఆఫ‌ర్ రావ‌డంతో చిత్ర‌బృందం కూడా జీ తెలుగుకి ఈ సినిమా రైట్స్‌కి క‌ట్ట‌బెట్టే ప‌నుల్లో ఉన్న‌ట్టు టాక్‌. బాహుబ‌లి రెండు భాగాలూ కలిపి దాదాపుగా రూ.28 కోట్లకు అమ్మేశారు. అంటే ఒక్కొక్క భాగం రూ.14 కోట్ల‌న్న‌మాట‌. ఆ లెక్క‌న మ‌హేష్ సినిమా రెండు కోట్లు ఎక్కువే ప‌లికింద‌ని, బాహుబ‌లి రికార్డ్ ని బ్రేక్ చేసేసింద‌ని సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఉత్సాహ‌ప‌డుతున్నారు. అయితే హిందీ వెర్ష‌న్ రైట్స్ రూ.10 కోట్ల‌కు అమ్ముడుపోయింది. బాహుబ‌లి 2కి మాత్రం ఏకంగా రూ.52 కోట్లు ప‌లికాయి. హిందీ రైట్స్ లో మాత్రం బాహుబ‌లి నీడ‌ని కూడా క‌నీసం టచ్ చేయ‌లేక‌పోయింద‌న్న‌మాట‌. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com