Home

»

Latest News

కేతికా శ‌ర్మ‌.. బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్!

Sep 28, 2021 1:06PM

తెలుగు తెర‌పై మెర‌వనున్న స‌రికొత్త సోయ‌గం.. కేతికా శ‌ర్మ‌. సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ పిక్స్ తో హీటెక్కించే ఈ గ్లామ‌ర్ డాళ్.. త్వ‌ర‌లో రెండు తెలుగు సినిమాల‌తో సంద‌డి చేయ‌నుంది. విశేష‌మేమిటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా వారం వ్య‌వ‌ధిలో సిల్వ‌ర్ స్క్రీన్ పైకి రాబోతున్నాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ఆకాశ్ పూరికి జంట‌గా కేతికా శ‌ర్మ న‌టించిన రొమాంటిక్ డ్రామా `రొమాంటిక్`. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కథ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి అనిల్ పాడూరి ద‌ర్శ‌కుడు. కాగా, దీపావ‌ళి కానుక‌గా నవంబ‌ర్ 4న ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్టైన‌ర్ రిలీజ్ కానుంది. క‌ట్ చేస్తే.. ఆ సినిమా విడుద‌లైన వారం త‌రువాత అంటే న‌వంబ‌ర్ 12న మ‌రో చిత్రం రాబోతోంది. అదే.. `ల‌క్ష్య`.  నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాని సంతోష్ జాగ‌ర్ల‌మూడి రూపొందించారు. ఆర్చ‌రీ బ్యాక్ డ్రాప్ మూవీగా `లక్ష్య‌` తెర‌కెక్కింది.

మ‌రి.. వారం వ్య‌వ‌ధిలో వ‌స్తున్న ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో  న్యూ టాలెంట్ కేతికా శ‌ర్మ‌.. ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com