Home

»

Latest News

`భ‌వ‌దీయుడు..! భ‌గ‌త్ సింగ్`కి ముహూర్తం ఫిక్స్!

Sep 28, 2021 2:08PM

`గ‌బ్బ‌ర్ సింగ్` (2012) వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, స్టార్ కెప్టెన్ హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం `భ‌వ‌దీయుడు..! భ‌గ‌త్ సింగ్`. `గ‌బ్బ‌ర్ సింగ్`కి బాణీలు అందించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కూడా స్వ‌రాలు స‌మ‌కూర్చ‌నున్నారు. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ భారీ బ‌డ్జెట్ ఫిల్మ్ ని నిర్మించ‌నుంది. ఇందులో ప‌వ‌న్ కి జంట‌గా పూజా హెగ్డే, ప్రియ‌మ‌ణి న‌టించ‌నున్నార‌ని టాక్.

ఇదిలా ఉంటే.. `భ‌వ‌దీయుడు..! భ‌గ‌త్ సింగ్`కి సంబంధించి పూజా కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 15న జ‌రుపనున్నార‌ని స‌మాచారం. అలాగే, న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి.. ఆపై చ‌క‌చ‌కా సినిమాని పూర్తిచేయ‌నున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మ‌రి.. `గ‌బ్బ‌ర్ సింగ్` త‌ర‌హాలో `భ‌వ‌దీయుడు..! భ‌గ‌త్ సింగ్` కూడా బాక్సాఫీస్ ముంగిట సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

కాగా, `భ‌వ‌దీయుడు..! భ‌గ‌త్ సింగ్` కంటే ముందు `భీమ్లా నాయ‌క్`, `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`తో ప‌ల‌క‌రించ‌నున్నారు ప‌వ‌న్. 2022 జ‌న‌వ‌రి 12న `భీమ్లా నాయ‌క్` రానుండ‌గా.. ఏప్రిల్ 29న `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` రిలీజ్ కానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com